తొలి భారత పేసర్ గా అర్షదీప్ సింగ్ సరికొత్త రికార్డు..భారత్ ఘన విజయం..!

భారత్-ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో తాజాగా జరిగిన రెండవ మ్యాచ్లో భారత్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను 2-0 తో కైవసం చేసుకుంది.

 Arshadeep Singh's New Record As The First Indian Pacer..india's Great Victory..!-TeluguStop.com

ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు.ఈ మ్యాచ్ లో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ ఆర్షదీప్ సింగ్( Arshdeep Singh ) ఓ అరుదైన ఘనత సాధించాడు.టీ20 లో అత్యంత వేగంగా 50 వికెట్లను తీసిన భారత పేసర్ గా ఆర్షదీప్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఈ మ్యాచ్లో ఆండ్రూ బల్బిర్నీ ను అవుట్ చేయడంతో ఆర్షదీప్ సింగ్ ఈ అరుదైన ఘనతను సాధించాడు.ఆర్షదీప్ తన 33వ టీ20 మ్యాచ్ లోనే ఈ ఫీట్ అందుకున్నాడు.గతంలో ఈ రికార్డ్ భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉండేది.

బుమ్రా 41 మ్యాచ్ లలో ఈ రికార్డ్ సాధించాడు.తాజాగా జరిగిన మ్యాచ్ తో బుమ్రా( Jasprit Bumrah ) రికార్డ్ ను ఆర్షదీప్ బద్దలు కొట్టేశాడు.

ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్ గా ఆర్షదీప్ సింగ్ నిలిచాడు.భారత జట్టు వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్( Kuldeep Yadav ) 30 టీ20 మ్యాచ్ లలో 50 వికెట్ల మైలురాయిని చేరి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

మొన్నటి వరకు తనపై వస్తున్న వరుస విమర్శలకు తాజాగా ఆర్షదీప్ సింగ్ చెక్ పెట్టేశాడు.ఈ సిరీస్ తొలి మ్యాచ్లో డెత్ ఓవర్ లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకోవడం వల్ల ఫ్యాన్స్ ఆగ్రహం తో విమర్శల పాలు అయ్యాడు.విండీస్( west indies ) సిరీస్ లో కూడా ఒక మ్యాచ్లో పేలవ ఆటను ప్రదర్శించడం వల్ల ఫ్యాన్స్ విమర్శిస్తూ ట్రోల్స్ చేశారు.అయితే ప్రస్తుతం తనపై వస్తున్న విమర్శలకు ఈ అరుదైన రికార్డుతో చెక్ పెట్టేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube