బ్యాంకులు( Banks ) అనేవి కస్టమర్లకు ఇచ్చే రుణాల ద్వారా లభించే వడ్డీలపై ఎక్కువ లాభాలను ఆర్జిస్తూ ఉంటాయి.ఈ క్రమంలో అప్పు తీసుకున్నవారు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించని పక్షంలో పీనల్ ఇంట్రెస్ట్ (జరిమానా వడ్డీ)ని బ్యాంకులు ఎక్కువ డబ్బుని గుంజుతూ ఉంటాయి.
ఈ అదనపు వడ్డీ అనేది లోన్ తీసుకున్న వారికి వాటికి తలకు మించిన భారంగా మారుతుంది ఒక్కోసారి.తాజాగా RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి మంచి శుభవార్త చెప్పింది.
శుక్రవారం రుణ నిబంధనలను సవరిస్తూ రుణాలపై పీనల్ ఇంట్రెస్ట్‌ని నిషేధించింది.

అవును, అవాక్కవుతున్నారా? మీరు విన్నది నిజమే.2024, జనవరి 1 ఈ మార్పు అమల్లోకి వస్తుంది.ఈ నిబంధనలను ప్రకటిస్తూ.
RBI చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.పీనల్ ఇంట్రెస్ట్( Penal Interest ) అనేది రుణగ్రహీతలకు రుణాలను సకాలంలో చెల్లించడం నేర్పించేలా ఉండాలే కానీ వారినుండి ఎక్కువ డబ్బు గుంజేదిగా ఉండకూడదని వ్యాఖ్యానించింది.‘ఫెయిర్ లెండింగ్ ప్రాక్టీస్-పీనల్ ఛార్జీస్ ఇన్ లోన్ అకౌంట్స్'( Fair Lending Practice – Penal Charges in Loan Accounts ) నోటిఫికేషన్‌లో ఆర్‌బీఐ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC)లు 2024 నుంచి సరైన పీనల్ ఛార్జీలును మాత్రమే లోన్ గ్రహీతల నుంచి వసూలు చేయాలి.

కొత్త నిబంధనల ప్రకారం, రుణ ఒప్పందం నిబంధనలకు అనుగుణంగా లేని రుణగ్రహీతల నుంచి బ్యాంకులు పీనల్ ఛార్జీలను అయితే వసూలు చేయవచ్చు.కానీ పీనల్ ఇంట్రెస్ట్‌ని మాత్రం అస్సలు వసూలు చేయకూడదు.రుణంపై వడ్డీ రేటుకు కూడా పీనల్ ఛార్జీలను జోడించకూడదు. ‘రీజనబుల్’ పీనల్ ఛార్జీలు అంటే ఏమిటో ఆర్‌బీఐ( RBI ) ఇంకా నిర్దిష్ట మార్గదర్శకాలను విడుదల చేయలేదు.
కాబట్టి ఎక్కువ డబ్బు సంపాదించడానికి బ్యాంకులు అధిక పీనల్ ఛార్జీలను వసూలు చేయడానికి ప్రయత్నించే అవకాశం కూడా లేకపోలేదు.అయితే బ్యాంకులు అధికంగా పీనల్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తేలితే మాత్రం ఆర్‌బీఐ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
మీకు అలాంటి సమస్య ఎదురైతే మీరు కేసు పెట్టవచ్చు.







