టీడీపీ అధినేత నారా లోకేశ్ పాదయాత్రపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.పాదయాత్ర చేసినా లోకేశ్ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందలేరని మాజీ మంత్రి వెల్లంపల్లి అన్నారు.
లోకేశ్ ఎక్కువగా ఊహించుకుంటున్నారని వెల్లంపల్లి విమర్శించారు.లోకేశ్ విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.
లోకేశ్ కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువని విమర్శించారు.అలాంటి వ్యక్తి నిర్వహించే పాదయాత్రను ఎవరూ అడ్డుకోరని తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో నారా లోకేశ్ పాదయాత్ర ప్రవేశించనున్న సంగతి తెలిసిందే.విజయవాడ ప్రాంతాన్ని గతంలో విస్మరించామని, ఈ నేపథ్యంలో తప్పు అయిందని చెప్పి జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.







