తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.మహారాష్ట్రలో ప్రయాణిస్తున్న సమయంలో రైలులో అగ్నిప్రమాదం జరిగింది.
ఉదయం ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మంటలను గమనించి వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ను నాగ్ పూర్ సమీపంలో నిలిపివేశారు.దీంతో వెంటనే ప్రయాణికులు బోగి దిగి బయటకు పరుగులు పెట్టారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
కాగా ఎస్-2 బోగీలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.







