జనగామలోని అధికార పార్టీ బీఆర్ఎస్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఈ మేరకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా జనగామలో ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణలు సమావేశం అయ్యారని తెలుస్తోంది.
రాజకీయాలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కలుషితం చేస్తున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జనగామ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు.
ఈ క్రమంలోనే పల్లాపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నారని సమాచారం.
మరోవైపు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తన అనుచరులతో సమావేశం అయ్యారు.
ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని నిన్న మరో వర్గం భేటీ అయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అభ్యర్థుల ప్రకటనకు ముందే బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు మారుతున్నాయి.
అదేవిధంగా బీఆర్ఎస్ టికెట్ దక్కకపోతే ప్రత్యామ్నాయ మార్గాలపై ముత్తిరెడ్డి ఇప్పటికే దృష్టి సారించారని తెలుస్తోంది.