విశ్వక్, నేహా శెట్టి డాన్స్ పర్ఫార్మెన్స్.. క్షణాల్లో వీడియో వైరల్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen ) ఒకరు.అనతి కాలంలోనే విశ్వక్ తెలుగు ప్రేక్షకులను మెప్పించి తన నటనతో యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు.

 Vishwak Sen Neha Shetty Dance On Stage, Director Krishna Chaitanya, Vishwak Se-TeluguStop.com

సినిమా సినిమాకు వేరియేషన్స్ తో ప్రేక్షకులకు చేరువ అయిన విశ్వక్ ప్రస్తుతం మరో కొత్త సినిమాతో వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

కృష్ణ చైతన్య ( Krishna Chaitanya ) దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాకు ”గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”( Gangs Of Godavari ) అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.ఇక టైటిల్ గ్లింప్స్ తోనే ఆకట్టుకున్న విశ్వక్ టీమ్ తాజాగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి ఈ సినిమాపై మరింత హైప్ పెంచేశారు.‘సుట్టంలా సూసి’ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ యూత్ ను బాగా ఆకట్టు కుంటుంది…

విశ్వక్, నేహా షీటీ రొమాన్స్ మాములుగా లేదు.వీరి కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది.ఇక ఈ సాంగ్ ను లాంచ్ చేసేందుకు చిన్న ఈవెంట్ ను ప్లాన్ చేయగా ఈ ఈవెంట్ లో కూడా విశ్వక్, నేహా శెట్టి స్టేజ్ మీదనే చేసిన పర్ఫార్మెన్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది.

ఈ సాంగ్ లో విశ్వక్ ఎలాగైతే నేహా శెట్టి చీర లాగుతాడో అలాగే స్టేజ్ మీద కూడా చేసి అందరికి షాక్ ఇచ్చారు.

ఈ కొత్తరకం పబ్లిసిటీ చూసిన వారంతా నోరెళ్ల బెడుతున్నారు.మొన్నటికి మొన్న విజయ్, సమంత( Samantha ) ఖుషి మ్యూజికల్ ఈవెంట్ లో ఇలాంటి హాట్ రొమాన్స్ తో కూడిన పర్ఫార్మెన్స్ చేసారు.ఇక ఇప్పుడు విశ్వక్, నేహా కూడా అలాగే స్టేజ్ మీద డాన్స్ చేసారు.

దీంతో ఈ సినిమా కూడా భారీ హైప్ తెచ్చుకుంది.లీడ్ పెయిర్ ఈ తరహా డ్యాన్సులు చేస్తూ ప్రేక్షకులకు కొత్త పబ్లిసిటీ పరిచయం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube