తెలంగాణలో ఎన్నికల పోరు మొదలైపోయింది.ఒక పార్టీపై మరో పార్టీ పై చేయి సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకుంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే పనిలో ఉన్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని బిజెపి కాంగ్రెస్ లో దూకుడు పెంచడంతో, అంతే స్థాయిలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ పై చేయి సాధించేందుకు బీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ ( CM kcr )ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు.జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనలు ముమ్మరం చేశారు.
అనేక హామీలను ఇస్తూ ప్రజల దృష్టి బీఆర్ఎస్ వైపు ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అలాగే ఉద్యోగులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉండడంతో వారిని బుద్ధికించేందుకు అనేక స్కీములను ప్రకటించారు.మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు .కొత్తగా అనేక హామీలను ఇస్తున్నారు.ఇక అభ్యర్థులకు సంబంధించి కసరత్తు ఇప్పటికే పూర్తయింది.మరికొద్ది రోజుల్లోనే దానిని రిలీజ్ చేయనున్నారు.పనితీరు సక్రమంగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పై కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారు.ఎమ్మెల్యేల కు సంబంధించిన సర్వే నివేదికలను దగ్గర పెట్టుకుని వారిని పిలిపించి మరి వారికి క్లాస్ పీకుతున్నరట.
దీంతో కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిందనగానే బీఆర్ఎస్( BRS party ) సిట్టింగ్ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారట.ఎన్నికల నోటిఫికేషన్ కు వంద రోజులు మాత్రమే సమయం ఉండడంతో, కెసిఆర్ సీరియస్ గా నిర్ణయాలు తీసుకోవడంతో కొత్త జాబితాలో తమ పేరు ఉంటుందా లేదా అనే టెన్షన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు నెలకొందట.
ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రగతి భవన్ నుంచి పిలుపు అందిందట.

ఇక కేసీఆర్ ( CM kcr )ను కలిసిన ఎమ్మెల్యేలకు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారట.ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా ? ప్రజల్లో మీ గ్రాఫ్ ఎలా ఉంది ? నియోజకవర్గంలో ఎన్ని రోజులు అందుబాటులో ఉంటున్నారు ? ఇప్పటివరకు ఇచ్చిన హామీలను నియోజకవర్గంలో ఎంతవరకు అమలు చేశారు ? అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు చోటు చేసుకున్నాయి. భూ వివాదాలు, కాంట్రాక్టు పనుల్లో మీ పాత్ర ఎంతవరకు ఉంది ఇలా అనేక విషయాలపై ప్రశ్నిస్తూ సర్వే నివేదికలను వారి ముందు ఉంచుతున్నారట.
దీంతో ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది అనగానే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైపోతోందట.







