సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా

తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా పడింది.ఈనెల 19 వ తేదీన కేసీఆర్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాయిదా వేశారని తెలుస్తోంది.

 Cm Kcr's Visit To Medak District Postponed-TeluguStop.com

అయితే భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయన్న వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తిరిగి ఈనెల 23న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube