అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఏజెంట్ సినిమా( Agent Movie ) నిర్మాతలు, బయ్యర్లకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే.వైజాగ్ సతీష్ ఈ సినిమా ద్వారా ఊహించని స్థాయిలో నష్టపోయారు.
ఈ సినిమా నష్టాల భర్తీ కోసం ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది.అయితే కోర్టు నుంచి అనుకూల తీర్పు రాకపోయినా కేసు విచారణ వాయిదా పడింది.
మైత్రీ మూవీ మేకర్స్ సినిమాల హక్కులను ప్రధానంగా సతీష్ కొనుగోలు చేస్తున్నారు.

అయితే సతీష్( Satish ) కోర్టుమెట్లు ఎక్కడంతో టాలీవుడ్ గిల్డ్ సతీష్ ను బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.సతీష్ ను బ్యాన్ చేయలేదని కానీ బ్యాన్ చేయాలనే చర్చ మాత్రం జరిగిందని తెలుస్తోంది.సాధారణంగా సతీష్ వివాదాలకు దూరంగా ఉంటారని అయితే ఏజెంట్ మూవీ ఘోరంగా నష్టాలను మిగల్చడంతో సతీష్ ఈ విధంగా చేశారని సమాచారం అందుతోంది.
సతీష్ తనపై నిజంగానే బ్యాన్ విధిస్తే ఏం చేస్తారో చూడాల్సి ఉంది.ఏజెంట్ ఫ్లాప్ తో సినిమాల హక్కులను కొనే విషయంలో సతీష్ సైతం ఆచితూచి అడుగులు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి.
సతీష్ కు న్యాయం జరగాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.సతీష్ పై సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో ఎలాంటి రిమార్క్ లేదు.సతీష్ సైతం పెద్ద సినిమాల హక్కుల విషయంలో ముందే మాట్లాడుకుంటే మంచిది.

పాన్ ఇండియా సినిమాలను నిర్మించే నిర్మాతలు( Producers ) సైతం కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.పెద్ద్ద సినిమాలకు నష్టాలు వస్తే ఆ నష్టాలను భరించడం సులువైన విషయం కాదు.బడ్జెట్ హద్దులు దాటకుండా పెద్ద నిర్మాతలు సినిమాలను నిర్మిస్తే మంచిది.
ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఎక్కువ సినిమాలు నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి.







