రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) సినిమా ఎలా తీసినా ఆ సినిమాకు అద్భుతంగా ప్రమోషన్స్ చేస్తారనే సంగతి తెలిసిందే.వ్యూహం సినిమా ఫస్ట్ టీజర్, సెకండ్ టీజర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
పాత్రల కోసం ఎంపిక చేసుకున్న నటీనటుల విషయంలో రామ్ గోపాల్ వర్మ నూటికి నూరు మార్కులు సాధించారు.ఈ విషయంలో వర్మకు మరెవరూ సాటిరారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
అయితే వ్యూహం సినిమా( Vyuham movie ) వల్ల వైసీపీకి లాభమా? నష్టమా? అనే ప్రచారం జరుగుతోంది.సీఎం జగన్ జీవితంలో చోటు చేసుకున్న ఘటనలు ప్రజలకు తెలియనివి కావు.2019 ఎన్నికల్లో సీఎం జగన్ గెలుపుకు పాదయాత్ర కారణమనే సంగతి తెలిసిందే.అయితే వ్యూహం సెకండ్ టీజర్ లో పవన్ కళ్యాణ్ ను ఎందుకు టార్గెట్ చేశారని పవన్ అభిమానుల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యూహం సెకండ్ టీజర్ ఉంది.వ్యూహం సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి విజయం సాధిస్తుందేమో చూడాలి.అయితే ఆర్జీవీని కాకుండా మరో డైరెక్టర్ ను ఈ సినిమా కోసం ఎంచుకుని ఉంటే బాగుండేది.గత ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రిలీజ్ చేసి ఆర్జీవీ వార్తల్లో నిలిచారు.
వ్యూహం సినిమా కోర్టు వివాదాల్లో చిక్కుకునే ఛాన్స్ ఉంది.

వ్యూహం సినిమాలో జగన్ పాత్రను వర్మ ఫుల్ పాజిటివ్ గా చూపించనున్నారు.వివేకా హత్య కేసును సైతం ఈ సినిమాలో ప్రస్తావించనున్నారని తెలుస్తోంది.ఈ సన్నివేశాలను వర్మ ఎలా డీల్ చేస్తారో చూడాలి.
వ్యూహం సినిమా సక్సెస్ సాధించాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు.ఒకింత భారీ బడ్జెట్ తో వ్యూహం సినిమా తెరకెక్కి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యూహంతో వర్మ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.







