హైదరాబాద్ లో భూముల వేలంకు మరోసారి రంగం సిద్ధమైంది.మోకిల ఫేజ్-2 భూముల వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా మోకిల వద్ద 300 ప్లాట్ల అమ్మకానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.
మూడు వందల ప్లాట్లలో 98,975 గజాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.
కాగా ఈ లే అవుట్ లో మూడు వందల నుంచి ఐదు వందల గజాల ప్లాట్స్ ను హెచ్ఎండీఏ అందుబాటులో ఉంచింది.ఇందుకోసం నేటి నుంచి ఆగస్ట్ 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని అధికారులు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.రూ.1,180 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న హెచ్ఎండీఏ వేలంలో పాల్గొనే వారు ఈఎండీ రూ.లక్ష చెల్లించాలని పేర్కొంది.అయితే మోకిలా మొదటి ఫేజ్ లో గజానికి అత్యధిక ధర రూ.లక్షా ఐదు వేలు పలకగా అత్యల్పంగా రూ.72 వేలు పలికిన సంగతి తెలిసిందే.