జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన వారిద్దరూ దండుపాళ్యం బ్యాచ్ అంటూ విమర్శించారు.
ప్రభుత్వ నిర్మాణాలపై పవన్ కు ఉన్న అభ్యంతరం ఏంటని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.కొండపై నిర్మాణాలు చేపడితే తప్పా అన్న ఆయన పవన్ జ్ఞానం వచ్చే పుస్తకాలు చదివుంటే బాగుండేదని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి మంచిపేరు రాకూడదనే పవన్ ఉద్దేశమని వెల్లడించారు.బాబు బంధువు కాబట్టే గీతం వర్సిటీ అక్రమాలు పవన్ కు కనపడలేదని విమర్శించారు.







