సోలార్ జనరేటర్ తో కరెంట్ కోతలకు చెక్.. ధర, ఫీచర్స్ ఇవే..!

వర్షాకాలం, వేసవికాలం వచ్చాయంటే కరెంటు కోతలు( Power cuts ) చాలా ఇబ్బందులు పెడతాయి.ఒక్కోసారి కరెంట్ దాదాపుగా ఒక రోజు వరకు కోతకు గురయ్యే అవకాశం ఉంటుంది.

 Check For Current Cuts With Solar Generator The Price And Features Are The Same-TeluguStop.com

కరెంటు కోతలకు చాలానే కారణాలు ఉన్నాయి.కానీ కరెంటు కోతలు మన ముఖ్యమైన పనులను ఆపేస్తాయి.

మరి కరెంట్ కోతల సమస్య కు చెక్ పెట్టాలనుకుంటే అది పోర్టబుల్ సోలార్ జనరేటర్ తోనే సాధ్యం.ఈ జనరేటర్ కు సంబంధించిన ఫీచర్స్ తో పాటు ధర వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

ఈ పోర్టబుల్ సోలార్ జనరేటర్ పేరు SARRVAD S-150.ఈ సోలార్ జనరేటర్ ఒక చిన్న బ్యాటరీ పరిమాణంలో ఉంటుంది.దీనిని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.ఇది చాలా తేలికగా ఉంటుంది.టీవీ, ల్యాప్ టాప్ లాంటి పరికరాలకు చార్జింగ్ కూడా చేసుకోవచ్చు.

ఈ సోలార్ జనరేటర్ సామర్థ్యం విషయానికి వస్తే 42000mAh 155Wh.ఈ జనరేటర్ బరువు 1.89 కిలోలు.దీన్ని సోలార్ ప్యానల్ ( Solar panel )తో (14V-22V/3A గరిష్టంగా) సూర్య కాంతి ద్వారా చార్జ్ చేయవచ్చు.దీనిని బ్యాగ్ లో పెట్టుకుని ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు.

ఎక్కడైనా దీనిని చార్జ్ చేసుకోవచ్చు.ఇంట్లో ఉండే ల్యాప్ టాప్, టీవీ, రేడియో, పవర్ బ్యాంక్, స్మార్ట్ ఫోన్ లాంటి చిన్నచిన్న అన్ని ఎలక్ట్రిక్ పరికరాలకు చార్జింగ్ చేసుకోవచ్చు.

కరెంటు లేని అత్యవసర పరిసరాలలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఈ జనరేటర్ అవుట్ డోర్ చాలా బాగా పనిచేస్తుంది.

వివిధ పార్టీల సమయంలో మ్యూజిక్ సిస్టంను అమలు చేయడం వంటి ఫంక్షన్ల కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు.ఈ సోలార్ జనరేటర్ ధర విషయానికి వస్తే రూ.19000 గా ఉంది.ఈ జనరేటర్ తో కరెంటు కోతలకు చెక్ పెట్టండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube