అవును, మీరు విన్నది నిజమే.సిక్కుల( Sikhs ) పొడవాటి గడ్డంపైన అక్కడ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ గడ్డం మాకు అడ్డమే అంటున్నారు అక్కడి అధికారులు.అమెరికాలో మతపరమైన వివక్షకు సంబంధించిన ఒక అంశం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.
విషయం ఏమిటంటే… న్యూయార్క్ రాష్ట్రంలో సీనియర్ పోలీసు అధికారి హోదాలో ఉన్న సిక్కు మతానికి చెందిన చరణ్‌జోత్ తివానా( Charanjot Tiwana ) మత స్వేచ్ఛకు భంగం కలిగించేలా అక్కడి ఉన్నతాధికారులు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది.
“ఒక సీనియర్ పోలీసు అధికారి హోదాలో ఉండి అలా గడ్డం పెంచకూడదని మీకు తెలియదా? అయితే దాన్నిక కత్తిరించండి!” అని అతడికి ఆదేశాలు జారీ చేసారు.దాంతో అతగాడు తనకు పెళ్లి జరగబోతోందని.సాంప్రదాయబద్ధంగా కనిపించేందుకు గడ్డం పెంచుకోవాల్సిన అవశ్యకత ఉందని చరణ్‌జోత్ తివానా ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చాడు.
అయితే అత్యవసర సమయాల్లో గ్యాస్ మాస్క్ ( Gas mask )ధరించాల్సి వచ్చినప్పుడు గడ్డం అడ్డంకిగా మారుతుందన్న కారణాన్ని చూపించి గడ్డం పెంచుకునే ఆఫీసర్లు అతనికి పర్మిషన్ ఇవ్వలేదు.
దాంతో ఇదే అంశంపై అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్), న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీలలో( New York State Assemblies ) వాడివేడి చర్చ జరిగింది.పలువురు అమెరికా చట్టసభ సభ్యులు దీనిని మత వివక్షగా అభివర్ణించడంతో ఈ విషయాన్ని భారత దౌత్య బృందం న్యూయార్క్ స్టేట్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది.భారత దౌత్యవేత్త తరణ్‌జీత్ సింగ్ సంధూ.
బైడెన్ కార్యవర్గంలోని సీనియర్ అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చారు.ఈ అంశంపై న్యూయార్క్ స్టేట్ పోలీస్, గవర్నర్ కార్యాలయం పనిచేస్తున్నాయి.
పోలీసు సిబ్బంది గడ్డంపై ఇటీవలే పలు నిబంధనల్లో మార్పులు చేశామని న్యూయార్క్ పోలీసు శాఖ అధికార ప్రతినిధి ఒకరు తాజాగా వెల్లడించారు.అయితే దీనిపైన ఇంకా తుది చర్చలు జరగాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ కాగా అనేకమంది సిక్కు యువకులు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.