బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ( Hrithik Roshan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి హృతిక్ రోషన్ తాజాగా తాను నటించిన కోయీ మిల్ గయా సినిమా( Koi Mil Gaya ) గురించి పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.ఈ సినిమా ఆగస్టు ఎనిమిదవ తేదీకి విడుదల 20 సంవత్సరాలు పూర్తి కావడంతో హృతిక్ రోషన్ ఈ సినిమా గురించి కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు.
హృతిక్ రోషన్ ప్రీతి జింటా ( Preity Zinta )జంటగా నటించిన ఈ సినిమా తన నిజ జీవితానికి కాస్త దగ్గరగా ఉంటుందని తెలిపారు.ఈ సినిమాలో తాను ఒక అమాయకపు పిల్లాడి పాత్రలో నటించాను అయితే నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయని తెలిపారు.

ఈ సినిమాలో తాను నత్తి( Stammering ) ఉన్న పాత్రలో నటించాను.అయితే చిన్నప్పుడు నాకు కూడా కాస్త నత్తి ఉండేది.నేను మాట్లాడుతుంటే చాలామంది నన్ను ఎగతాళి చేసేవారు.ఇలా నత్తి మాట్లాడటం వల్ల ఎంతోమంది నవ్వే వారని ఈ సందర్భంగా హృతిక్ రోషన్ తెలిపారు.అయితే ఈ సినిమాలో కూడా నా పాత్ర అలాగే ఉండేది ఇక స్కూల్లో నా స్కూటీని ధ్వంసం చేసినట్టు సినిమాలో చూపించారు.నిజ జీవితంలో కూడా అలాగే జరిగిందని అయితే నేను అప్పుడు సైకిల్ పై స్కూల్ కి వెళ్లే వాడిని తెలిపారు.కొందరు సీనియర్స్ నా సైకిల్ పూర్తిగా పాడు చేశారని ఆ సమయంలో నాకు పట్టరాని కోపం వచ్చిందని హృతిక్ రోషన్ తన చిన్నప్పటి విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు

రోహిత్ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉండడంతో ఈ సినిమాలో చాలా సహజంగా నటించగలిగానని హృతిక్ రోషన్ తెలిపారు.మొదటిసారి రేఖా( Senior Actress Rekha ) మేడం తో కలిసి నటించానని తెలిపారు.ఇందులో ఆమె ఒక చెంప దెబ్బ కొట్టే సన్నివేశం ఉంది.నిజంగా కొడితే ఎమోషన్స్ చాలా అద్భుతంగా వస్తాయని చెప్పి ఆమె నన్ను కొట్టారు.అయితే చాలా గట్టిగా కొట్టారని ఆ చెంప దెబ్బ ఎప్పటికీ నేను మర్చిపోలేననీ ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను గుర్తు చేసుకుంటూ హృతిక్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.