లోక్ సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.కేంద్రంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అవిశ్వాసంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు.
దీనిపై బీజేపీ తరపున నిశికాంత్ దూబేకు మాట్లాడే అవకాశం కల్పించారు.
కాగా బీజేపీ సభ్యుడు ప్రసంగాన్ని ప్రారంభించగా దానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు.ఈ క్రమంలోనే నిన్న రాహుల్ గాంధీపై నిశికాంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపట్టింది.
అనంతరం నిశికాంత్ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది.కాంగ్రెస్ సభ్యుల నిరసన నేపథ్యంలో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.







