మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భోళా శంకర్ ( Bhola shankar) మూవీ మరో మూడు రోజుల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కాబోతున్న నేపథ్యంలో శిల్పకళా వేదికలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు.
అయితే ఈ ఈవెంట్లో జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన కమెడియన్ హైపర్ ఆది ( Haiper Aadi ) మెగా ఫ్యామిలీని పొగుడుతూ టాలీవుడ్ డైరెక్టర్ అయిన వర్మపై ఇన్ డైరెక్టుగా సెటైర్లు వేశారు.అయితే ప్రస్తుతం హైపర్ ఆది వేసిన సెటైర్ కి చిరంజీవి (Chiranjeevi) సినిమాకి కౌంటర్ ఇచ్చాడు ఆర్జీవి.
హైపర్ ఆది స్టేజ్ పై మాట్లాడుతూ.ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ ఉన్నారు కానీ ఆయన కి చెప్పే అంత స్థాయి నాకు లేదు.
కానీ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ని మెగా ఫ్యామిలీని అనే అంత స్థాయి ఆ డైరెక్టర్ కి లేదు.అలాంటి డైరెక్టర్ చిన్న పెగ్గు వేస్తూ చిరంజీవిని పెద్ద పేగు వేస్తూ పవన్ కళ్యాణ్ ని దూషించడం ఏమాత్రం సరికాదు.
అంటూ పరోక్షంగా రాంగోపాల్ వర్మ( Ram gopal varma ) పై హైపర్ ఆది సెటైర్ వేశాడు.అయితే ఎప్పటినుండో రాంగోపాల్ వర్మ వైసిపి కి సపోర్ట్ గా ఉంటూ మెగా ఫ్యామిలీ పై,జనసేన పార్టీపై, టిడిపి పార్టీ పై ఇండైరెక్టుగా సెటైర్లు వేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే తాజాగా హైపర్ ఆది వేసిన సెటైర్ కి రాంగోపాల్ వర్మ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా దారుణమైన ట్వీట్ చేశారు.ఇక అందులో ఒక అమ్మాయి పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఓ చేత్తో మందు గ్లాసు పట్టుకొని ఉన్న తన ఫోటోని షేర్ చేస్తూ “Her Foot is better than p r of b s” అంటూ పరోక్షంగా భోళా శంకర్ ( Bhola shankar ) సినిమా ఆ అమ్మాయి కాలిగోటికి కూడా సమానం కాదు అన్నట్లు ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది ఆర్జీవి ( RGV ) కి సపోర్ట్ చేస్తే మరి కొంత మంది మెగా ఫ్యాన్స్ కి అండగా ఉంటూ సోషల్ మీడియాలో కామెంట్ల యుద్ధం చేస్తున్నారు.మరి ఆర్జీవి చేసిన ట్వీట్ పై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.







