మంత్రి కాన్వాయ్ లపై యువతి ఆగ్రహం.. నెటిజన్స్ ప్రశంసలు..!

సమాజంలో జరిగే తప్పులు, అన్యాయాలను చూసి, కొందరు మనకెందుకు అని మౌనంగా ఉంటే.కేవలం కొద్ది మంది మాత్రమే ధైర్యంగా ఆ తప్పులను ఎండగట్టే ప్రయత్నం చేస్తారు.

 Hyderabad Somajiguda Woman Fires On Minister Convoy Details, Hyderabad, Somajigu-TeluguStop.com

ప్రస్తుతం సోషల్ మీడియా పాపులర్ కావడంతో సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం వైరల్ అవుతోంది.శనివారం హైదరాబాదులోని( Hyderabad ) సోమాజిగూడలో ఓ యువతీ ఏకంగా మంత్రి కాన్వాయ్ లకే( Minister Convoy ) అడ్డుగా నిలబడి ప్రశ్నించడంతో అధికారులతో పాటు పోలీసులు కూడా మౌనంగానే ఉండాల్సి వచ్చింది.

అసలేం జరిగిందో తెలుసుకుందాం.

హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే మంత్రుల ప్రోటోకాల్ కాన్వాయ్ లోని పైలెట్ వెహికిల్ సైరన్ మోగిస్తూ వాహనదారులను ఇబ్బంది పెట్టారు.కాన్వాయి లలో అధికారులు, మంత్రులు ఎవరూ లేకపోయినా.ట్రాఫిక్ జామ్( Traffic Jam ) అయిన సందర్భంలో సైరన్ మోగించడంతో వాహనదారులంతా ఇబ్బంది పడ్డారు.అయితే ఒక యువతి మాత్రం మంత్రుల కాన్వాయ్ వాహనానికి అడ్డుగా నిలబడి వాగ్వాదానికి దిగింది.

తన హెల్మెట్ తో కారు బన్నెట్ పై బలంగా కొట్టి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

Telugu Convoy, Convoy Siren, Hyderabad, Siren, Somajiguda, Jam-General-Telugu

ఆ యువతి స్కూటీపై ఖైరతాబాద్ చౌరస్తా నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తోంది.అదే మార్గంలో మంత్రుల కాన్వాయ్ వెహికల్స్ వెళ్తున్నాయి.ఎర్రమంజిల్ చౌరస్తా వద్ద ఎస్కార్ట్ సిబ్బంది సైరన్( Siren ) మోగిస్తూ వాహనాన్ని నడిపారు.

ఈ క్రమంలో ఆ యువతి ఆ కాన్వాయ్ వాహనాలకు ముందుగా వెళుతోంది.అసలే ట్రాఫిక్ జామ్ తో విసిగిపోయిన ఆ యువతీ పదే పదే సైరన్ మోగిస్తూ ఉండడంతో ఆగ్రహం పట్టలేక పైలట్ వెహికల్ ముందు స్కూటీ ( Scooty )అడ్డంగా ఆపి పోలీసులపై ఆగ్రహంతో విరుచుకుపడింది.

Telugu Convoy, Convoy Siren, Hyderabad, Siren, Somajiguda, Jam-General-Telugu

కాన్వాయ్ లో మంత్రులు, అధికారులు ఎవరూ లేకపోయినా ఎందుకు సైరన్ మోగిస్తున్నారని గట్టిగా ప్రశ్నించింది.ముందు ట్రాఫిక్ జామ్ అయింది కదా అది మీకు కనిపించడం లేదా అని నిలదీసింది.ప్రజల కోసం పనిచేసే మంత్రులు, వీఐపీలు వెళ్తుంటే ప్రజలు ఎందుకు దారి ఇవ్వాలని ప్రశ్నించింది.అకాల వర్షాలకు నగరంలోని రోడ్లపై డ్రైనేజీలు పొంగి, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయితే పట్టించుకోని మంత్రులకు ఎందుకు రూట్ క్లియర్ చేయాలని ఆగ్రహించింది.

ప్రజలకు కూడా అత్యవసర పనులు ఉంటాయని గట్టిగా వాదనకు దిగింది.

యువతి ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు చెప్పలేకపోయారు.

వాహనదారులంతా ఫోన్లో వీడియోలు రికార్డు చేసి, ఆ యువతి మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదని సపోర్ట్ చేశారు.వీడియో చూసిన నెటిజన్స్ అంతా ఆ యువతిని సపోర్ట్ చేస్తూ ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube