అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( US President Joe Biden ) భారత పర్యటన ఖరారైంది.ఈ ఏడాది సెప్టెంబర్ 7న ఆయన న్యూఢిల్లీలో ల్యాండ్ అవ్వనున్నారు.
ఈ సందర్భంగా మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆయన ఇండియాలోనే వుండనున్నారు.భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న జీ20 సమ్మిట్‌లో( G-20 Summit ) పాల్గొని సెప్టెంబర్ 10న తిరిగి బైడెన్ వాషింగ్టన్‌కు చేరుకుంటారని అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సెప్టెంబర్ 9 , 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.గతేడాది డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది నవంబర్ 30 వరకు భారత్ జీ20 అధ్యక్ష హోదాలో వుంటుంది.
ఈ ఏడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) అమెరికా పర్యటన సందర్భంగా .సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సు కోసం తాను ఎదురుచూస్తున్నానని బైడెన్ పేర్కొనడం విశేషం.జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలను భారత్( India ) సమర్థవంతంగా నిర్వహిస్తోందని ఆయన ప్రశంసించారు.బహుపాక్షిక సంస్థలను బలోపేతం చేయడం, వాతావరణ మార్పులు, కోవిడ్ మహమ్మారి, అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడం , సుస్థిరతను సాధించడం వంటి ఐక్యరాజ్యసమితి( UNO ) లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తామని భారత్ – అమెరికాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

సెప్టెంబర్‌లో జీ 20 సమ్మిట్ కోసం జో బైడెన్ భారత్‌కు వెళతారని దక్షిణ, మధ్య ఆసియా విదేశాంగ సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ( Donald Lu ) తెలిపారు.భారత్ , అమెరికా సంబంధాలకు ఇది కీలక సంవత్సరంగా ఆయన అభివర్ణించారు.భారత్ జీ20కి ఆతిథ్యం ఇస్తుండగా.అమెరికా APEC, జపాన్ జీ7కి ఆతిథ్యం ఇస్తోంది.క్వాడ్ దేశాల సభ్యులు వారి వారి నాయకత్వ బాధ్యతలను సమర్థవంతంగా పోషిస్తున్నారని లూ చెప్పారు.

ఈ ఏడాది మార్చిలో యూఎస్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్( Antony Blinken ) జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు భారతదేశానికి వచ్చారు.అలాగే యూఎస్ ట్రెజరీ కార్యదర్శి జానెట్ యెల్లెన్, వాణిజ్య కార్యదర్శి గినా రైమాండోలు ఇండియాకు వచ్చారు.వీరు న్యూఢిల్లీలో జరిగిన ఇండియా యూఎస్ ఫోరమ్‌కు కూడా హాజరయ్యారు.







