సినిమాలకు యువత ఎక్కువగా వెళుతూ ఉంటారు.స్నేహితులతో కలిసి థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఇక కుటుంబసభ్యులందరూ కలిసి తన పిల్లలను తీసుకుని సినిమాకు వెళుతూ ఉంటారు.కుటుంబమంతా కలిసి సరదాగా సమయం గడుపుతారు.
ఇక ప్రేమికులు కూడా సినిమాలు చూసేందుకు థియేటర్ కు వెళుతూ ఉంటారు.అయితే సినిమా థియేటర్లలో వృద్ధులు కనిపించరు.
వయస్సు రీత్యా, అనారోగ్య కారణాలు, సినిమాలు చూడాలనే ఆసక్తి ఆ వయస్సులో కలగకపోవడంతో థియేటర్లలో కనిపించరు.
యువకుల గొల మధ్య సినిమా చూడాలంటే వృద్ధులకు అసౌకర్యంగా ఉంటుంది.
అందుకే సినిమా థియేటర్లకు వెళ్లరు.ఏదైనా సినిమా నచ్చితే ఇంట్లోనే చూస్తారు.
కానీ బార్బీ సినిమా చూసేందుకు ఓ వృద్ధ జంట( An old couple ) సినిమా థియేటర్‌కు వచ్చింది.దీనికి సంబంధించిన వీడియోను షకీనా( Shakina ) అనే యూజర్ టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడంతో ఈ క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ వీడియోలో వృద్ధ దంపతులు చూడముచ్చటగా ఉన్నారు.ఒకరి చేయి ఒకరు పట్టుకుని సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చారు.
దీంతో ఈ జంటను సినిమా ప్రేక్షకులందరూ ఆసక్తిగా చూశారు.

వృద్దాప్యంలో కూడా ఈ వృద్ధ దంపతుల మధ్య ఉన్న ప్రేమను చూసి అందరూ మురిసిపోతున్నారు.అయితే జులై 21న బార్బీ సినిమా ( barbie movie )ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.మార్గట్ రాబీ, ర్యాన్ గాస్లింగ్, దువ లిప, సిము లి, అరియానా గ్రీన్ బ్లాట్, మైఖేల్ రాబీ ఇందులో నటించారు.
గ్రెటా గెర్వింగ్( Greta Gerving ) ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో అన్ని వయస్సువారు సినిమా చూసేందుకు వెళుతున్నారు.దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి.రూ.కోట్లలో ఈ సినిమాకు కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి, గత నెల 21న ఈ సినిమా విడుదల అవ్వగా.ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది.







