చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన భోళా శంకర్ మూవీ( Bhola Shankar ) థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 7 రోజుల సమయం మాత్రమే ఉంది.అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు నిర్మాత అనిల్ సుంకరకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అనిల్ సుంకర గతంలో నిర్మించిన సినిమాల వల్ల ప్రస్తుతం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
అనిల్ సుంకర గతంలో కొంతమందితో కలిసి గూఢచారి సినిమాను నిర్మించగా ఈ సినిమా నిర్మాణ బాధ్యతను అనిల్ సుంకర తీసుకున్నారు.
చాలా సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా లెక్కలు తేలకపోవడంతో సునీల్ నారంగ్ దగ్గర పంచాయితీ పెట్టారని సమాచారం అందుతోంది.అభిషేక్ నామా( Abhishek Nama ) తనకు రావాల్సిన వాటా గురించి నిర్మాతల మండలికి లెటర్ పెట్టారని టాక్ వినిపిస్తుండటం గమనార్హం.

మరోవైపు ఏజెంట్ మూవీ హక్కులు కొనుగోలు చేసిన సతీష్ ఏజెంట్( Agent ) సినిమా వల్ల తాను దారుణంగా నష్టపోయానని తనకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించినట్టు సమాచారం.అయితే భోళా శంకర్ మూవీ విడుదల ఆపాలని మాత్రం సతీష్ కోరలేదని తెలుస్తోంది.భోళా శంకర్ సినిమా రిలీజ్ కు ముందు లెక్కలు తేలడానికి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, భాగస్వాములు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

అనిల్ సుంకరకు ఎదురవుతున్న ఈ ఇబ్బందుల వల్ల భోళా శంకర్మూవీ ప్రమోషన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.భోళా శంకర్ సినిమాతో సక్సెస్ సాధించడం అనిల్ సుంకరకు కీలకమనే సంగతి తెలిసిందే.సామజవరగమన సినిమాతో సక్సెస్ ను అందుకున్న ఈ నిర్మాత తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
భోళా శంకర్ రిలీజ్ సమయానికి ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలని అభిమానులు ఫీలవుతున్నారు.







