జాన్వీ కపూర్( Janhvi Kapoor ) శ్రీదేవి ( Sridevi ) వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే త్వరలోనే ఈమె సౌత్ ప్రేక్షకుల ముందుకు దేవర సినిమా ( Devara Movie ).
ద్వారా రాబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి.
కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా మారిపోయారు.
తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఎన్టీఆర్( Ntr ) సినిమా కారణంగా తాను ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు తెలియజేశారు.ఎన్టీఆర్ సినిమా కారణంగా ఈమె ఏడాది పాటు సినిమాలకు దూరం కావడం ఏంటి అని విషయానికి వస్తే… ఎన్టీఆర్ తో సినిమా చేయాలని జాన్వీ కపూర్ఎప్పటినుంచో అనుకుంటున్నారట అయితే దేవర సినిమా ప్రకటించిన సమయంలో ఈ సినిమాలో అవకాశం పొందాలని కోరుకున్నారట.ఈ క్రమంలోనే తాను ఏడాది పాటు ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వకుండా ఉంటే ఈ సినిమాలో చేసే ఛాన్స్ తనకే వస్తుందని భావించి ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా వెల్లడించారు.

అయితే ఈమె కోరుకున్నట్టుగానే ఈ సినిమాలో అవకాశం రావడంతోఎంతో సంతోషంలో ఉన్నట్టు తెలియజేశారు.ఇక ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పనులలో కూడా ఈమె బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.








