శ్రీదేవి( Sridevi ) వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్( Janhvi Kapoor ) .ఇలా నటిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే సౌత్ ప్రేక్షకుల ముందుకు కూడా రావడానికి సిద్ధమయ్యారు.
ఇలా హీరోయిన్ గా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే జాన్వీ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.
ఈ క్రమంలోని వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఈ సందర్భంగా ఒక నెటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ మీకు ఎవరితో నటించాలని ఉంది అంటూ ప్రశ్న వేశారు.అయితే ఈ ప్రశ్నకు మాత్రమే చాలా పెద్ద లిస్ట్ ఉందని సమాధానం చెప్పుకొచ్చారు.ముందుగా ఎన్టీఆర్( NTR ) తో నటించాలని తాను ఏడాది పాటు కోరుతూ ఉన్నానని తెలియజేశారు.
అనంతరం ఈ జాబితాలో రణబీర్ ( Ranbir Kaoor ) కపూర్ కూడా ఉన్నారని తెలిపారు.ఆయనతో కలిసి నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలియజేశారు.
ఈ హీరోలతో పాటు రణవీర్ సింగ్,హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వంటి హీరోలతో నటించాలని ఉంది అంటూ తన కోరికల లిస్ట్ బయట పెట్టారు.

ఇలా హీరోలతో మాత్రమే కాకుండా కొందరి దర్శకులతో ( Directors ) కూడా నటించాలని నాకు చాలా కోరికగా ఉంది అంటూ అనంతరం దర్శకుల లిస్ట్ బయట పెట్టారు.నీరజ్ ఘెవాన్, సంజయ్ లీల భన్సాలీ, కరణ్ జోహార్ దర్శకత్వంలో నటించడం కోసం తాను ఎదురుచూస్తున్నానని తెలియజేశారు.ఈ విధంగా ఇండస్ట్రీలో తాను ఎవరెవరితో నటించాలని అనుకున్నారో వారందరి లిస్ట్ ఈ సందర్భంగా బయట పెట్టడంతో నేటిజన్స్ ఈమెకు చాలా పెద్ద కోరికల లిస్ట్ ఉంది అయితే ఈమె కోరికలు తొందరలోనే నెరవేరాలని ఈమె అనుకున్న వారందరితో కలిసి నటించాలనీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.