జబర్దస్త్ షో( Jabardasth ) ద్వారా పాపులర్ అయిన కమెడియన్లలో ధనరాజ్( Dhanraj ) ఒకరు.ధనరాజ్ కొన్ని సినిమాలలో హీరోగా నటించి విజయాలను సొంతం చేసుకున్నారు.
బిగ్ బాస్ షో ద్వారా ధనరాజ్ పాపులారిటీని మరింత పెంచుకోగా ఆయనను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.తాజాగా ధనరాజ్ ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ చేసిన ఎమోషనల్ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఈవెంట్ లో ధనరాజ్ మాట్లాడుతూ మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదని అన్నారు.నాన్నను( Father ) ఎప్పుడూ ఊహించుకుంటూ ఉంటానని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచంలో నాకు రక్త సంబంధం అనేదే లేదని ధనరాజ్ కామెంట్లు చేశారు.నాకు రక్త సంబంధం ఏదైనా ఉంటే వీళ్లిద్దరితోనే మొదలైందంటూ ధనరాజ్ తన కుటుంబ సభ్యులను చూపించారు.

ధనరాజ్ కొడుకు( Dhanraj Son ) మాట్లాడుతూ డాడీ, తమ్ముడు, మమ్మీ వీళ్లే నా ప్రపంచం అని అన్నారు.ఫ్యామిలీ నంబర్1 పేరుతో ఈ ఈవెంట్ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఒకటైన జీ తెలుగు( Zee Telugu ) ఛానల్ లో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది.ఈ ప్రోమోకు దాదాపుగా 3 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.ధనరాజ్ ఎమోషనల్ అవుతుండటంతో ఆయన అభిమానులు ఫీలవుతున్నారు.

జబర్దస్త్ ధనరాజ్ బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యారు.ఈ షో ద్వారా ధనరాజ్ కు భారీ రేంజ్ లో పారితోషికం దక్కిందని సమాచారం అందుతోంది.ధనరాజ్ ను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ధనరాజ్ కు కెరీర్ పరంగా మంచి జరగాలని ధనరాజ్ మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ధనరాజ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు.ధనరాజ్ కామెడీ టైమింగ్ బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు.







