జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో 50శాతం ఫీజు రాయితీ..సర్క్యులర్ జారీ చేసిన డీఈవో

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టీయూడబ్ల్యూజే -ఐజేయు) ఖమ్మం జిల్లా కమిటీ ప్రాతినిధ్యం మేరకు ఖమ్మం జిల్లాలో పనిచేసే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల పిల్లలకు ఖమ్మం జిల్లా( Khammam District )లో నిఅన్ని ప్రైవేట్ పాఠశాలలో 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ( Somasekhara Sarma ) సర్క్యులర్ జారీ చేశారు.ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో సర్క్యులర్ కాపి ని టియూడబ్ల్యూజే (ఐజేయు) ఖమ్మం జిల్లా కమిటీ బాధ్యులకు అందజేశారు.

 50 Percent Fee Concession In Private School For Journalist's Children..deo I-TeluguStop.com

సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ కల్పించాలని తమ యూనియన్ చేసిన విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన డీఈవో వెంటనే సర్క్యులర్ జారీ చేస్తూ అన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు, ప్రైవేట్ పాఠశాల యజమానుల సంఘానికి, మండల విద్యాశాఖ అధికారులకు పంపించారని, కావున జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులంతా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా( Electronic media ) అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే ఐజేయు నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు వై మాధవరావు జనార్ధన చారి తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube