యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్( Vishwak Sen ) ఒకరు.అనతి కాలంలోనే విశ్వక్ తెలుగు ప్రేక్షకులను మెప్పించి తన నటనతో యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు.
సినిమా సినిమాకు వేరియేషన్స్ తో ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యాడు.విశ్వక్ సేన్ నటించి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీ ధమ్కీ( Dhamki ) ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది.

ఇక ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు వరుసగా క్రేజీ సినిమాలను లైన్లో పెట్టాడు.ఇప్పుడు విశ్వక్ సేన్ ప్రజెంట్ రెండు సినిమాలను ప్రకటించి ఒకేసారి పూర్తి చేస్తున్నాడు.10, 11వ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న విశ్వక్ సేన్ తాజాగా తన కొత్త సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అదిరిపోయే లెవల్లో ఆకట్టుకుంటుంది.
కృష్ణ చైతన్య( Krishna Chaitany ) దర్శకత్వంలో చేస్తున్న తన సినిమా నుండి టైటిల్ అండ్ గ్లింప్స్ రావడంతో అందరి చూపు విశ్వక్ మీద పడింది.
ఇక విశ్వక్ కొత్త సినిమాకు ”గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు.ఈ టైటిల్ ను రివీల్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు.
విశ్వక్ ను మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ లుక్ లో చూపించారు.ఇక ఈ గ్లింప్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉంది.
ఈసారి పొలిటికల్ ను టచ్ చేస్తూ విశ్వక్ నటిస్తున్న ఈ సినిమాపై టీజర్ గ్లింప్స్ తో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.
యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమాను డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.







