టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత ఇటీవల శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఇటీవలే ఖుషి సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది సమంత.అలాగే బాలీవుడ్ లో సిటాడెల్( Citadel ) అనే ఒక వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
ఇలా ఇప్పటివరకు తాను కమిట్ అయిన సినిమాలను అన్ని పూర్తి చేసుకున్న సమంత దాదాపు ఏడాది పాటు బ్రేక్ తీసుకోబోతున్నట్టు చెబుతూ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

అయితే మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చి అడ్వాన్స్ ఇప్పించుకోగా వాటిని నిర్మాతలకు తిరిగి వెనక్కి చేసింది.ప్రస్తుతం సమంత వెకేషన్ లో ఉంది.కాగా గతేడాది ఈమె తనకు మయోసైటిస్ అనే వ్యాధి ఉన్నట్లు చెప్పి అభిమానులకు ఒకసారిగా షాక్ ఇచ్చింది.
ఇక అప్పటినుంచి ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఆ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ను తీసుకుంటూనే ఉంది.ఈ మయోసైటిస్ వ్యాధి( Myositis disease ) కారణంగా ప్రస్తుతం దాదాపు ఒక సంవత్సరం పాటు సినిమాలకు విరామం తీసుకుంది.
ఇక ఇటీవల విదేశాలకు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎక్కువగా మనశ్శాంతిని కోరుకుంటోంది.కెరియర్ పరంగా ఎంత బిజీ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

తరచూ ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చూసిన నెటిజన్స్ చాలామంది అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అప్పుడప్పుడు నువ్వు ఎక్కువ ద్వేషించే మనుషులు, ద్వేషించే మాటలను చూసి.విని ఉంటావేమో కానీ.ఈ ప్రపంచంలో మనం ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటూ సమంత పోస్ట్ ని రాసుకొచ్చింది.అయితే ఇది మరో వ్యక్తిని ఉద్దేశించి పెట్టిందా? లేక ప్రస్తుతం ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా తన ఫీలింగ్స్ బయటపెట్టిందా అనేది క్లారిటీ లేదు.ఏది ఏమైనా ప్రేమ విషయంలో మాత్రం సమంత చాలా పాజిటివ్ గా ఉన్నట్లు ఈ పోస్ట్ స్పష్టం చేస్తోంది.అంతేకాకుండా ఈ పోస్ట్ ని చూసిన నెటిజన్స్ సమంత మళ్ళీ లవ్ లో పడిందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.