వాట్సప్ అలర్ట్: ఆ నెంబర్లతో మీకు వాట్సప్ కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త.. లేకపోతే మీ అకౌంట్ ఖాళీ గురూ..!

స్మార్ట్‌ఫోన్( Smartphone ) ఉన్న ప్రతిఒక్కరు తప్పనిసరిగా ఉపయోగించే యాప్ వాట్సప్( WhatsApp ).ఇతరులతో ఛాట్ చేసుకోవడానికి లేదా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ పంపించుకోవడానికి ఉపయోగపడుతుంది.

 Whatsapp Alert Are You Getting Whatsapp Calls From Those Numbers But Be Careful-TeluguStop.com

అలాగే గ్రూప్ వాయిస్ కాల్, వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు.అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను వాట్సప్ తీసుకొస్తూ ఉంటుంది.

యూజర్ల భద్రత, ఫేక్ వార్తలను గుర్తించడానికి అనేక కొత్త ఫీచర్లు తీసుకొస్తూ ఉంటుంది.

Telugu Phone, Scam, Spam, Tech, Whatsapp-Latest News - Telugu

అయితే వాట్సప్‌లో అనేక ఫేక్ కాల్స్, ఫేక్ మెస్సేజ్‌లు వస్తూ ఉంటాయి. సైబర్ నేరగాళ్లు( Cyber ​​criminals ) స్పామ్ మెస్సెజ్‌లను పంపిస్తూ ఉంటారు.అలాగే స్పామ్ కాల్స్ కూడా వాట్సప్ లో వస్తూ ఉంటాయి.

ఈ క్రమంలో తాజాగా వాట్సప్ లో +92, +84, +62 నెంబర్లతో అనేక కాల్స్ వస్తున్నాయి.ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే అకౌంట్ ఖాళీ అవుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి వచ్చే ఈ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

Telugu Phone, Scam, Spam, Tech, Whatsapp-Latest News - Telugu

సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ ( Silence unknown callers )అనే ఫీచర్‌ను స్పామ్ కాల్స్ నుంచి యూజర్లకు రక్షణ కల్పించేందుకు వాట్సప్ తీసుకొచ్చింది.అయినప్పటికీ ఇప్పటికే స్పామ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి.మలేషియా, కెన్యా, వియత్నాం ఇథిమెపియా వంటి దేశాల నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి.

కొంతమంది యూజర్లకు రెండు రోజుల వ్యవధిలోనే 2 నుంచి 4 అన్‌నోన్ కాల్స్ ఈ నెంబర్ల నుంచి వచ్చాయి.పాత నెంబర్లే కాకుండా కొత్తగా సిమ్ కార్డు పొందినవారికి కూడా ఇలాంటి మెస్సేజ్ లు వస్తున్నాయి.

దీంతో ఇలాంటి కాల్స్ ను బ్లాక్ చేసి రిపోర్ట్ కొట్టాలని నిపుణులు చెబుతున్నారు.తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్ లను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్పామర్ల నుంచి బయటపడవచ్చని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube