సమాజంలో నీచులు ఉంటారని తెలుసు,కానీ మరి ఇలాంటి నీచులు కూడా ఉంటారా అని ఈ వార్త వింటే అనిపిస్తుంది.డబ్బు, మద్యం కోసం ఎన్నో దారుణాలు చేస్తారు, కానీ మద్యం కోసం ఓ భర్త తన భార్యను( Wife ) స్నేహితుల దగ్గర తాకట్టు పెట్టి దగ్గరుండి మరి వారితో అత్యాచారం చేయించాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని( Uttar Pradesh ) సంబాల్ లో చోటుచేసుకుని తాజాగా వెలుగులోకి వచ్చింది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఉత్తరప్రదేశ్ లోని సంబాల్ లో తేజ్ పాల్, నఖాసా దంపతులు నివాసం ఉంటున్నారు.
అయితే తేజ్ పాల్ బాధ్యతారహితంగా ఉంటూ మద్యానికి బానిస అయ్యాడు.ఇంట్లో డబ్బులు కనిపిస్తే.
క్షణాల్లో మద్యం కోసం ఖర్చు పెట్టేవాడు.ఇక తరచూ భార్యకు మద్యం కోసం డబ్బులు కావాలని వేధించేవాడు.

మద్యం ( Alcohol ) కోసం స్నేహితులను డబ్బు అడగగా వారు భార్యను తాకట్టు పెట్టాలని తేజ్ పాల్ కు ఒక కండిషన్ పెట్టారు.స్నేహితుల కండిషన్ ను అంగీకరించి తేజ్పాల్ వారిని ఇంటికి తీసుకువెళ్లి, వారితో పడుకోవాలని భార్యను ఒత్తిడికి గురి చేశాడు.భార్య ఎదురు తిరగడంతో విచక్షణారహితంగా కొట్టి స్నేహితులతో భార్యపై అత్యాచారం చేయించాడు.బాధితురాలు ఈ విషయం బయటపడితే తన పరువు పోతుందని ఎవరికి చెప్పాలో.ఏం చేయాలో తెలియక తనలో తానే కుమిలిపోయింది.భర్త స్నేహితులు తరచూ ఇంటికి వచ్చి ఆమెపై ఇష్టం వచ్చినట్లు అఘాయిత్యానికి పాల్పడేవారు.
భర్త తేజ్పాల్( Tej Pal ) స్నేహితులకే సహకరిస్తూ ఉండడంతో ఆ బాధిత భార్య చివరకు పోలీసులను ఆశ్రయించింది.

తన భర్త మద్యం కోసం అతని స్నేహితుల వద్ద తనను తాకట్టు పెట్టాడని, వారు పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది.నఖాసా( Nakhasa ) మీద అత్యాచారానికి పాల్పడ్డ తేజ్పాల్ స్నేహితులైన కుల్దీప్, అరుణ్, యోగేష్ లపై 402,504, 376డి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న తేజ్పాల్ తో పాటు అతని స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఈ వార్త వైరల్ కావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ పలు రకాల ఘాటు విమర్శలు చేస్తూ ఇటువంటి వారిని నడిరోడ్డుపై నిలబెట్టి ఉరితీయాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.







