పవన్ కళ్యాణ్( Pawan kalyan ) తనయుడు అకీరా నందన్ ( Akira nandan )ఎప్పుడు వార్తల్లో ఉంటూనే ఉంటాడు.కానీ ఆయన ఎప్పుడు జనాల్లో కలవడు అనే అభిప్రాయం చాలా మంది లో ఉంది.
ఇతర హీరోల పిల్లలతో పోల్చితే అకీరా చాలా స్పెషల్ అని.పవన్ కళ్యాణ్ మాదిరిగానే అకీరా కూడా చాలా విభిన్నమైన మనస్థత్వం కలిగిన వ్యక్తి అన్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.అందుకే తన తండ్రి ఇమేజ్ ని ఎప్పుడు కూడా వినియోగించుకోవాలి అనుకోడు.అందులో భాగంగానే తన సొంతంగానే ఏదైనా చేస్తూ ఉంటాడు.

అసలు అకీరా కి సినిమా లపై ఆసక్తి లేదు అన్నట్లుగా రేణు దేశాయ్( Renu Desai ) ఒక సారి వ్యాఖ్యలు చేయడం జరిగింది.అకీరా తాజాగా తన తండ్రి పవన్ కళ్యాణ్ బ్రో సినిమా( Bro movie ) విడుదల సందర్భంగా థియేటర్ వద్ద సందడి చేశాడు.ఇలా థియేటర్ కు మొదటి రోజు మొదటి ఆట కోసం అకీరా రావడం ఇదే మొదటి సారి.దాంతో అభిమానులు పెద్ద ఎత్తున అకీరాని చూసేందుకు థియేటర్ వద్ద గుమ్మిగూడారు.
అకీరా కూడా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగాడు.,/br>

దాంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ముందు ముందు అకీరా జనాల్లో కలవడం ఖాయం, హీరోగా సినిమా లు చేయాలని కోరుకోవడం కూడా ఖాయం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.ఆరు అడుగకులకు ఎక్కువగానే హైట్ ఉండే అకీరా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడితే ఇతర హీరోలు కనీసం ఆయన ముందు కనిపించే అవకాశం కూడా లేదు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
అకీరా సినిమా ఒక అద్భుతం అన్నట్లుగా ఉండాలని.అప్పుడే పవన్ కి తగ్గ తనయుడు అన్నట్లుగా నిరూపించుకుంటాడు అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అకీరా ముందు ముందు మరిన్ని సోషల్ మీడియా పోస్ట్ లతో.ఇలాంటి సన్నివేశాలతో ఫ్యాన్స్ లో సందడి చేయాలని కోరుకుందాం.







