పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఒకవైపు సినిమాలకు సంబంధించిన పనులు చూసుకుంటూనే మరొకవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు.వారాహి యాత్రలో( Varahi Yatra ) భాగంగా పవన్ కళ్యాణ్ ఏపీలోని పలు జిల్లాలను సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ తనకు అవకాశం ఇవ్వమని అడుగుతూ ప్రజలను వేడుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాల విషయంగా వస్తే ప్రస్తుతం పవన్ నటించిన తాజా చిత్రం బ్రో.( Bro Movie ) ఈ సినిమా రేపు అనగా జూలై 28న విడుదల కానుంది.
విడుదల సమయం దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.

ఆ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ వేడుకకు హాజరైన పవన్ తన స్పీచ్‌లో సినిమా, రాజకీయ అంశాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావించారు.అవన్నీ ఒక ఎత్తు అయితే మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కు( Sai Dharam Tej ) హైదరాబాద్‌లో జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ. రోడ్లు బాగోలేవని గురించి కామెంట్ చేశారు.కానీ వెంటనే తాను చేసిన వ్యాఖ్యలు సరిద్దిదుకునే ప్రయత్నం చేశారు.అయితే ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు( CM KCR ) పవన్ భయపడ్డారని, అందుకే వెంటనే కవర్ చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సాయిధరమ్ తేజ్ బైక్‌పై వెళ్తున్నాడు.

పెద్ద స్పీడ్ కూడా కాదు.ఇసుక ఉండటంతో స్కిడ్ అయింది.మీకు తెలుసు కదా రోడ్లు సరిగా వేయరని కామెంట్ చేశారు.
కానీ అంతలోనే సర్దుకుని ఇక్కడ కాదు.అక్కడ అంటూ చేతితో చూపించారు.
ఫైనల్‌గా రోడ్లు క్లీన్ చేయలేదని ముగించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.
నెటిజన్లు సైతం రకరకాలుగా స్పందిస్తున్నారు.ముందు హైదరాబాద్ రోడ్లు బాగాలేవని అర్థం వచ్చేలా మాట్లాడిన పవన్.
ఆ తర్వాత వెంటనే కేసీఆర్ గుర్తొచ్చి, ఆయనకు భయపడే ఇలా మాట మార్చారని కామెంట్ చేస్తున్నారు.







