సోషల్ మీడియాలో తరచూ వీడియోలు పెడుతూ యాక్టివ్ గా ఉండడం సహించలేక పోయాడు ఆ చెల్లెలి అన్న.అతను ఎన్నిసార్లు చెప్పినా తన చెల్లెలు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం మానుకోకపోవడంతో ఆగ్రహంతో తన సొంత చెల్లెలినే హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem )లో చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు చూద్దాం.
</divవివరాల్లోకెళితే.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని ఇల్లెందు మండలం రాజీవ్ నగర్ లో అజ్మీరా దేవి అనే మహిళ నివాసం ఉంటుంది.ఈమెకు అజ్మీరా సింధు, అజ్మీరా హరిలాల్ అనే ఇద్దరు పిల్లలు సంతానం.
అజ్మీరా దేవి భర్త రెండు సంవత్సరాల క్రితం చనిపోవడంతో.అజ్మీరా దేవి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఇక కుమార్తె అజ్మీరా సింధు మహబూబ్ నగర్ లో ఏఎన్ఎం అప్రెంటిస్ గా పనిచేస్తోంది.అయితే సింధు ఎప్పుడు సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది.
సింధు సోషల్ మీడియా( Soial media )లో యాక్టివ్ గా ఉండడం అన్న హరిలాల్ కు నచ్చలేదు.ఈ విషయంపై తరచూ సింధుతో గొడవ పడేవాడు.
సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
</div
క్షణికావేశంలో హరిలాల్( Harilal ) తన సోదరి సింధుపై రోకలి బండతో దాడి చేశాడు.దీంతో సింధు రక్తపు మడుగులోకి జారి కింద పడింది.వెంటనే ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం వరంగల్ కు తీసుకు వెళ్తుండగా మార్గమధ్యంలో సింధు మృతి చెందింది.అయితే హరిలాల్ రాయి తగిలి తన చెల్లెలు చనిపోయింది అని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు.మంగళవారం కుటుంబ సభ్యులు హడావిడిగా సింధు అంత్యక్రియలు ఏర్పాటు చేస్తుండగా గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి రావడంతో అప్పటికే హరిలాల్ అక్కడి నుండి పరారయ్యాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







