కర్నాటకలో కాంగ్రెస్( Karnataka Congress ) అధికారంలోకి వచ్చి దాదాపుగా మూడు నెలలు కావొస్తుంది.అయితే ఈ మూడు నెలలకే కాంగ్రెస్.
బీజేపీ ఫోబియా వెంటాడుతున్నాట్లు తాజా పరిణామలు చూస్తే అర్థమౌతుంది.తమ ప్రభుత్వాన్ని కూలదొసేందుకు కుట్ర జరుగుతోందని స్వయంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డిప్యూటీ సిఎం డీకే శివకుమార్( DK Shiva Kumar ) వ్యాఖ్యానించారంటే.
ఆ పార్టీని బీజేపీ ఎంతలా భయపెడుతోందో అర్థం చేసుకోవచ్చు.ఎందుకంటే, మహారాష్ట్ర, మద్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చి బీజేపీ అధికారం చేపట్టింది.
దాంతో చాలా రాష్ట్రాలలోని పార్టీలు బీజేపీ విషయంలో భయపడుతూనే ఉన్నాయి.

బిహార్ లో నితీశ్ కుమార్ బీజేపీ భయంతోనే ఎన్డీయే నుంచి భయటకు వచ్చి ఆర్జేడి తో చేతులు కలిపారు.ఈ విధంగా ఆయా రాష్ట్రాలలోని ప్రభుత్వాలకు బీజేపీ నుంచి గండం గట్టిగానే పొంచి ఉంది.ఇక కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు భయాందోళనకు లోనౌతోంది.
ఎన్నికల ముందు రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.తమ పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీ వల్ల తామ ప్రభుత్వానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని రాహుల్ గాంధీ గతంలోనే చెప్పుకొచ్చారు.
ఇప్పుడు డీకే శివకుమార్ కూడా బీజేపీ కుట్ర చేస్తోందని, అందుకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఉందని డీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ను కూల్చేందుకు బీజేపీ నేతలు( BJP ) ఇప్పటికే ఇతర పార్టీ నేతలతో ఒప్పందాలు కూడా మొదలు పెట్టారని డీకే సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో బీజేపీ వ్యూహాలను కాంగ్రెస్ ముందుగా పసిగట్టిందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.అయితే కర్నాటకలో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ ఉంది.155 మంది ఎమ్మేల్యేలు కాంగ్రెస్ చేతిలో ఉన్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం అంతా తేలికైన విషయం కాదు.
అయినప్పటికి బీజేపీ విషయంలో కాంగ్రెస్ కొంత అలెర్ట్ అయినట్లే తెలుస్తోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.







