ముడతలు మచ్చలు లేని మెరిసే ముఖ చర్మం కోసం కచ్చితంగా ఈ క్రీమ్ ను ట్రై చేయండి!

ముఖంపై ఎలాంటి ముడతలు, మచ్చలు( Wrinkles and Scars ) లేకుండా కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని చాలా మంది కోరుకుంటారు.ఇందుకోసమే మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన క్రీమ్, సీరం, మాయిశ్చరైజర్ తదితర ఉత్పత్తుల‌న్నీ వాడుతుంటారు.

 Homemade Face Cream For Wrinkles And Spot Less Skin!, Face Cream, Homemade Face-TeluguStop.com

అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ మాత్రం మీ ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది .ముడతలు, మచ్చలు లేని మెరిసే చర్మాన్ని అందిస్తుంది.మరి ఇంతకీ ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Cream, Face Cream, Homemadeface, Latest, Skin Care, Skin Care Tips,

ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో హాఫ్ కప్పు ఆలివ్ ఆయిల్( Olive Oil ), రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకుని స్లో ఫ్లేమ్ పై ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులో రెండు నుంచి మూడు స్పూన్లు షియా బటర్( Shea Butter ) వేసి మెల్ట్ చేసుకోవాలి.మెల్ట్ అయిన బటర్ లో మూడు టేబుల్ స్పూన్లు కాఫీ ఆయిల్, రెండు చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, రెండు చుక్కలు జోజోబా ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకుని గంట లేదా రెండు గంటలు పాటు వదిలేయాలి.తద్వారా క్రీమ్ సిద్ధమవుతుంది.

ఈ క్రీమ్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ అంటే శుభ్రంగా తొలగించి వాటర్ తో వాష్ చేసుకోవాలి.

Telugu Tips, Cream, Face Cream, Homemadeface, Latest, Skin Care, Skin Care Tips,

ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఇలా ప్రతిరోజు క‌నుక చేస్తే స్కిన్ టైట్ గా బ్రైట్ గా మారుతుంది.ముడతలు అన్న మాట అనరు.అలాగే మొండి మచ్చలను సైతం ఈ క్రీమ్ సహజంగానే తొలగిస్తుంది.ముఖ చర్మాన్ని యవ్వనంగా మెరిపిస్తుంది.పైగా ఈ క్రీమ్ డార్క్ సర్కిల్స్ ను నివారించడానికి సైతం అద్భుతంగా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube