రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు అభిమానుల హృదయాలను గెలుచుకున్న హీరోలలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకరు.రాజకీయాలకు, సినిమాలకు ఈక్వల్ గా ప్రాధాన్యత ఇస్తూ రెండు రంగాలలో సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
వకీల్ సాబ్ సినిమాలో పవన్ తో కలిసి నటించిన లిరీష ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
లిరీష( lireesha ) మాట్లాడుతూ చాలామంది హీరోలకు ఫ్యాన్స్ ఉన్నారని అయితే పవన్ కళ్యాణ్ కు ఉన్న స్థాయిలో డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం ఎవరికీ లేరని ఆమె అన్నారు.
పవన్ కళ్యాణ్ కు భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని లిరీష చెప్పుకొచ్చారు. ఒక దేవుడి తర్వాత దేవుడితో సమానంగా అభిమానులు కొలిచే హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ మాత్రమేనని లిరీష అన్నారు.
పవన్ కళ్యాణ్ కు అంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.

తన దృష్టి ప్రకారం పవన్ కళ్యాణ్ బ్లెస్డ్ అని లిరీష వెల్లడించారు.నాకు రాజకీయాల గురించి ఎక్కువగా అవగాహన లేదని పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి నేను మాట్లాడకుండా ఉండటమే బెటర్ అని నా ఒపీనియన్ అని ఆమె పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా ఉంటారని లిరీష చెప్పుకొచ్చారు.
లిరీష వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాఅయి.

పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ ( Bro movie )నుంచి ట్రైలర్ మరికొన్ని గంటల్లో రిలీజ్ అవుతోంది.ఈ ట్రైలర్ పవన్ ఫ్యాన్స్ కు కచ్చితంగా నచ్చేలా ఉండనుందని తెలుస్తోంది.రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ కు భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.లిరీష వెల్లడించిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.







