యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Young Rebel Star Prabhas ) బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది.
దాంతో ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతోంది.కానీ సాహో.
రాధేశ్యామ్.ఆదిపురుష్ సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం తో పరిస్థితి ఏంటో అర్థం కాక అభిమానులు గందరగోళం కు గురి అవుతున్నారు.
కానీ ప్రభాస్ మాత్రం చాలా కూల్ గా సినిమా లను చేస్తూ బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు.ఈ ఏడాది సలార్ సినిమా( Salaar ) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
రెండు భాగాలుగా రాబోతున్న సలార్ మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ లో రాబోతున్న విషయం తెల్సిందే.ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా( Project K ) ను కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.కానీ సినిమా మేకింగ్ విషయం లో చాలా ఆలస్యం అవుతోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా ఇంకా బ్యాలన్స్ షూట్ చాలానే ఉంది.కనుక సంక్రాంతికి అంటూ సినిమా విడుదల చేయాలని భావించినా కూడా అది సాధ్యం కాకపోవచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియా( Social Media ) లో ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమా వాయిదా గురించి వార్తలు వచ్చాయి.ఇప్పటి వరకు ప్రాజెక్ట్ కే సినిమా విడుదల వాయిదా గురించి యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ రాలేదు.అయినా కూడా మేకర్స్ సంక్రాంతికి సినిమా( Sankranthi Releases ) ను విడుదల చేయలేరు అంటూ చాలా మంది బలంగా వాదిస్తూనే ఉన్నారు.
ఇక ప్రాజెక్ట్ కే సినిమా నుండి రాబోతున్న ఇంట్రెస్టింగ్ టీజర్ తో రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నారట.రిలీజ్ ను 2024 సంక్రాంతికి కాకుండా సమ్మర్ కు మార్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటూ నెటిజన్స్ లో చర్చ జరుగుతోంది.