యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కొంతమంది యువకులు సాటి మనిషికి సహాయం అనే పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి,గ్రూప్ సభ్యులందరూ మనిషికి రూ.100 జమ చేసి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ చేస్తున్న వాట్సాప్ సేవ పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది.సాటి మనిషికి సహాయం చేయాలనే ఆలోచనతో నారాయణపురం యువకులు వాట్సప్ గ్రూప్ పెట్టి,నిరుపేదలకు గుర్తించి వారికి గ్రూప్ లోని సభ్యులే కాకుండా గ్రామంలోని వ్యక్తుల నుండి రూ.100 చొప్పున సేకరించి వచ్చిన డబ్బులతో నిత్యావసర సరుకులను పేదలకు అందజేస్తున్నారు.మండల కేంద్రానికి చెందిన వినుకొండ తారకమ్మ, వినుకొండ నీరజల తల్లిదండ్రులు కాలం చేయగా, కట్టుకున్న వాళ్ళు వదిలేయగా,
అయినవాళ్లు ఎవరూ లేక,ఒకరికి వచ్చే రెండువేల పింఛన్ తోనే ఇద్దరికి పూట గడుపుతూ, ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే వండుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.కనీసం గ్యాస్ కొనుక్కొనే పరిస్థితి కూడా లేక వర్షం వస్తే పస్తులే ఉండాల్సిన పరిస్థితి తెలుసుకుని సాటి మనిషికి సాయం గ్రూప్ సభ్యుల తరుపున గ్యాస్ పొయ్యి,రెండు నెలలు నిత్యవసర సరుకులు అందించారు.
ఈ కార్యక్రమంలో నీళ్ల రాజు గౌడ్,ఉప్పల నాగరాజు,గంట రాజు,నీళ్ల రమేష్,కొప్పు రామకృష్ణ, గంగపురం సాయి గౌడ్,నీళ్ల రాకేష్,నీళ్ల నరేష్,ఏలే నర్సింహా,కట్ట శివ,భాను, కార్తీక్,మందుగుల సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.







