ఏపీలో ఎన్నికలకు ఎంతో సమయం లేదు సరిగ్గా చూస్తే పది నెలలు మాత్రమే సమయం ఉంది.దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి.
ఈసారి అధికారం కోసం వైసీపీ( YCP ) తో పాటు టీడీపీ, జనసేన( TDP, Jana Sena ) పార్టీలు కూడా గట్టిగానే పోటీ పడుతున్నాయి.ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీకి ఈ ఎన్నికలు ఎంతో కీలకం.
దాంతో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని తెగ ఆరాటపడుతోంది.అందుకే ఉన్న ఈ కొద్ది రోజులు నిత్యం ప్రజల్లో గడిపే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు అధినేత చంద్రబాబు నాయుడు.

ఇప్పటికే రోడ్ రోడ్ షోలు పర్యటనలు చేస్తూ నిత్యం ఏదో విధంగా పార్టీని ప్రజల్లో ఉంచుతున్నారు.ఇక మరోవైపు ఆయన తనయుడు నారా లోకేశ్( Nara Lokesh ) ఇప్పటికే యువగళం పాదయాత్రతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.ఇక ఇప్పుడు మరో కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చూయిట్టినట్లు తెలుస్తోంది.మహాశక్తి పేరుతో ఒక చైతన్య యాత్ర చేపట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాట్లు తెలుస్తోంది.దీనిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చేన్నాయుడు క్లారిటీ ఇచ్చారు కూడా.175 నియోజిక వర్గాలలో 40 రోజులపాటు ఈ చైతన్య యాత్ర ఉంటుందని తెలుస్తోంది.

ఈ చైతన్య యాత్రలో నియోజిక వర్గాల వారీగా టీడీపీకి సంబంధించిన కీలక నేతలు పాల్గొననున్నట్లు సమాచారం.ఇలా ఒకవైపు తాను పర్యటనలు చేస్తూనే మరోవైపు లోకేశ్ తో పాదయాత్ర చేయిస్తున్నారు చంద్రబాబు.ఇప్పుడు ముఖ్య పార్టీ ముఖ్య నేతలతో కూడా చైతన్య యాత్ర చేయిస్తు మొత్తం మీద పార్టీకి సంబంధించిన అందరూ ప్రజల్లో ఉండేలా చూస్తున్నారు.ఇప్పటికే అందరి కంటే ముందే మేనిఫెస్టో ప్రకటించి హాట్ టాపిక్ అయిన చంరబాబు.
ఇప్పుడు ఈ యాత్రలతో ఆ మేనిఫెస్టో ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.గతంలో మరి ఈసారి ఎన్నికలు టీడీపీకి డూ ఆర్ డై లాంటివి కావడంతో చంద్రబాబు వేస్తున్న ప్రతి వ్యూహం గెలుపు దిశగానే ఉంటోంది.
మరి టీడీపీకి ఈ యాత్రలు ఎంతవరకు మేలు చేసి గెలుపుకు బాటలు వేస్తాయో చూడాలి.







