అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి( Telangana Chief Revanth Reddy ) ఉచిత కరెంటు విషయమై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేగుతుంది.24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని రద్దుచేసి ఎనిమిది గంటలు ఇస్తే సరిపోతుందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు పై ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతల లో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komati Reddy Venkata Reddy ) లాంటి నేతలు రేవంత్ అలా అనడం తప్పే అంటూ ,రేవంత్ మాటలు కాంగ్రెస్ పార్టీకి ఫైనల్ కాదు అని ఏ విషయమైనా అధిష్టానం చెబితే నే ఫైనల్ అంటూ వాఖ్యలు చేస్తున్నారు.

అయితే నిజంగా రేవంత్ చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని చూస్తే కేవలం టెక్నికల్ విషయాలని వివరించడం కోసమే ఆయా వ్యాఖ్యలు చేశారే తప్ప తెలంగాణ రైతాంగానికి నష్టం చేసే ఆలోచన తో ఆయనలా మాట్లాడలేదని స్పష్టం అవుతుంది అని రేవంత్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు.తెలంగాణలో 95 శాతం మంది మూడు ఎకరాల లోపు వ్యవసాయం భూమి కలిగి ఉన్నారని, నిజానికి ఒక ఎకరానికి నీరు ఇవ్వాలంటే ఒక గంట సరిపోతుందని అలాంటప్పుడు మూడు ఎకరాలకు మూడు గంటలు సరిపోతుందని ఓవరాల్ గా చూసుకున్నా ఎనిమిది గంటల మించి కరెంట్ అవసరం ఉండదని, ఒకవేళ అలా నిరంతరం కరెంటు ఇవ్వడం వల్ల మోటార్లకు పెట్టిన ఆటోమేటిక్ స్టార్టర్లు పాడైపోయి మళ్ళీ అది వేల రూపాయల ఖర్చు అవుతుందని ఇది కేవలం ప్రభుత్వ కొన్ని వర్గాలతో కలిసి చేస్తున్న కుట్రే తప్ప దీని వల్ల రైతాంగానికి జరుగుతున్న మేలు ఏమీ లేదని, అవసరానికి మాత్రం ఇస్తే సరిపోతుందంటూ తమ నాయకుడు చేసిన వ్యాఖ్యలను తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వక్రీకరిస్తున్నారని రేవంత్ అనుచరులు మండిపడుతున్నారు.

అంతేకాకుండా రైతుబంధు పథకం( Rythu Bandhu Scheme ) కౌలు రైతులకు వర్తింప చేయకుండా భూ యజమానులకు వర్తింపచేయడం వల్ల అనేక చోట్ల కౌలు రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ తమ నాయకుడు చేసిన విలువైన వ్యాఖ్యలు మాత్రం ప్రచారానికి నోచుకోవడం లేదని రైతు అభ్యున్నతపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు దురుద్దేశం పూర్వకంగా చేసినవి కాదని కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.







