రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి మాజీ సర్పంచ్ మందాటి రాజు యాదవ్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.రాగట్లపల్లి మాజీ సర్పంచ్ మందాటి రాజు యాదవ్ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాజు యాదవ్ కుటుంబాన్ని పరామర్శించడానికి రాగట్లపల్లి వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు అతని భార్య రమ్యకు ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉండడానికి ఇల్లు లేనందున డబుల్ బెడ్ రూమ్ ఇప్పించాలని పిల్లలను చదివించాలని విజ్ఞప్తి చేశారు.
కుటుంబ సభ్యుల గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ , రాజు యాదవ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని పార్టీ పరంగా పిల్లలను చదివిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.
నెలరోజుల్లో రాజు యాదవ్ భార్య రమ్యకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డే కేర్ సెంటర్లో ఉద్యోగం కల్పించారు.దానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీని జిల్లా ఉపాధి కల్పన అధికారి లక్ష్మి రాజం , బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య చేతులు మీదుగా మంగళవారం అందజేశారు.
అదే విధంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంజూరు చేసిన డబుల్ బెడ్ ప్రొసీడింగ్ కాపీని తహాసిల్దార్ జయంత్ కుమార్ , ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ చేతుల మీదుగా రాజు భార్య రమ్యకు అందజేశారు.
ఈ సందర్భంగా బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆయన అన్నారు.
రాగట్లపల్లి గ్రామపంచాయతీగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సర్పంచిగా మందాటీ రాజు యాదవ్ గెలుపొంది ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడని ఆయన అన్నారు.రాజు యాదవ్ ను భౌతికంగా మనం తీసుకురాకపోయినా పార్టీ పరంగా రాజు యాదవ్ పిల్లలకు రాజు యాదవ్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి,
ఏఎంసీ మాజీ చైర్మన్ అందే సుభాష్ , గుల్లపల్లి నరసింహారెడ్డి , వీర్నపల్లి రెవెన్యూ డిప్యూటీ ఎమ్మార్వో ఎలుసాని ప్రవీణ్ యాదవ్, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, మహేందర్ యాదవ్, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , రాగట్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు మాందాటి రాము యాదవ్ , ఉప సర్పంచ్ మానుక సురేష్ యాదవ్ , బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నమిలికొండ శ్రీనివాస్, పిల్లి కిషన్, మాది ఉదయ్, నాగుల ప్రదీప్ గౌడ్ , సత్యం యాదవ్,లక్ష్మన్ యాదవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.







