పవన్ పై ధ్వజమెత్తిన తమ్మారెడ్డి భరద్వాజ్.. మనిషివా లేదా పశువువా అంటూ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) తాజాగా వాలంటరీ వ్యవస్థపై చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారుతున్నాయి.ఏపీలో మహిళల అక్రమ రవాణా జరుగుతోందని వాళ్ల సమచారాన్ని వాలంటీర్లు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు అందిస్తున్నారని తనకి కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చారని తనతో మాట్లాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్.

 Tammareddy Bharadwaj Fires On Pawan Kalyan Over Ap Volunteers Comments Tammared-TeluguStop.com

ఏపీలో 30 వేల మంది మహిళలు అదృశ్యం కావడం ఏంటో వాళ్లలో 14 వేల మంది సమాచారం లేకుండా పోయిందంటూ ఏపీ ప్రభుత్వం పై జగన్ </em( CM Jgan)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్.కాగా పవన్ చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లు భగ్గుమన్న విషయం తెలిసిందే.

Telugu Ap Volunteers, Cm Jagan, Janasena, Pawan Kalyan, Tamma Bharadwaj-Movie

తమని బ్రోకర్లుగా పోల్చడాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన బాట పట్టారు.పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మల్ని తగలబెడుతున్నారు.కేంద్ర నిఘా వర్గాలు పవన్ కి చెప్పిన ఉమెన్ మిస్సింగ్ ఇష్యూపై విచారణకు పట్టుపడుతూ నిరాధారమైన ఆరోపణలు చేసిన పవన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.కేఏ పాల్ ( K.A.Paul )లాంటి వాళ్లైతే పవన్ కళ్యాణ్‌ని ఏకంగా అరెస్ట్ చేయాలని అంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శక, నిర్మాత పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఏపీలో వాలంటీర్లు జీతం కోసం పనిచేయడం లేదు.వాళ్లకి కేవలం రూ.5 వేలు మాత్రమే ఇస్తున్నారు.వాళ్ల వల్ల వ్యవస్థకి మంచి జరుగుతుంది.అందులో మంచి చెడులు కూడా ఉంటాయి.కానీ ఒక వ్యవస్థకి డ్యామేజ్ చేస్తూ మాట్లాడటం ఎంత వరకూ కరెక్ట్.పవన్ కళ్యాణ్ గారూ, వాలంటీర్లను వాడుకుని మహిళల్ని ట్రాప్ చేస్తున్నారని అన్నారు.

ఇది చాలా డ్యామేజింగ్ మాట.వాలంటీర్లతో అమ్మాయిల వ్యాపారం చేస్తున్నారు అని అనడం కరెక్ట్ కాదు.మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారని ఈయనకి ఢిల్లీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అంటున్నారంటే మరి వాళ్లు ఏం చేస్తున్నట్టు.

Telugu Ap Volunteers, Cm Jagan, Janasena, Pawan Kalyan, Tamma Bharadwaj-Movie

మహిళల అక్రమ రవాణా అంటే అంత ఆకతాయితనంగా ఉందా? వాళ్లు చెప్పారంట.ఈయన విన్నారట.స్టేట్ మెంట్ ఇచ్చేస్తే సరిపోయిందా? అంటే రెస్పాన్సిబిలిటీ లేదా? మహిళల్ని అక్రమ రవాణా చేస్తుంటే.కేంద్రం వాళ్లు వచ్చి పవన్ కళ్యాణ్‌తో చెప్తే ఆయన ఆపేస్తారా? నిజంగా అదే జరిగితే పవన్‌తో చెప్పగానే ఆగిపోయిందా? నోటికి వచ్చింది మాట్లాడేస్తే సరిపోతుందా? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నట్టు? ఇందులో వాలంటీర్లకు సంబంధం ఏంటి? వెధవ ఐదు వేల రూపాయలకు వాళ్లు పనిచేస్తున్నారు.సమాజానికి పనికి వచ్చే పని చేస్తున్నారు.

అలాంటి వాళ్ల గురించి ఇంత నీఛమైన మాట మాట్లాడతారా? అలా నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకోవాలా? ఊరుకుంటే ఈ సమాజం ఎందుకు? సంకనాకడానికా? అసలు వీళ్లు మనుషులా దున్నపోతులా? కనీసం ఇప్పుడైనా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆలోచించుకోవాలి అంటూ ఒక రేంజ్‌లో విరుచుకు పడ్డారు తమ్మారెడ్డి భరద్వాజ.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube