అమ్మో షార్క్‌లు , రెండు రోజుల్లో ఐదుగురిపై దాడి.. న్యూయార్క్ బీచ్‌‌‌లపై డ్రోన్‌లతో నిఘా

లాంగ్ ఐలాండ్ సమీపంలో భయంకరమైన షార్క్‌లను , వాటి దాడులను పసిగట్టేందుకు న్యూయార్క్( New York ) రాష్ట్ర అధికారులు తీరం వెంబడి షార్క్ మానిటరింగ్ డ్రోన్‌లను మోహరిస్తున్నారు.గడిచిన రెండు రోజుల్లోనే ఐదు షార్క్ దాడులు నమోదైన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.

 New York To Deploy Shark-monitoring Drones To Beaches Following Reported Attacks-TeluguStop.com

ఈ వేటాడే జంతువులను ఎగువ నుంచి ట్రాక్ చేయడానికి న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తోంది.బ్యాటరీతో నడిచే డ్రోన్‌లను లాంగ్ ఐలాండ్, న్యూయార్క్‌లోని బీచ్ కమ్యూనిటీల చుట్టూ మోహరిస్తున్నారు.

‘‘ shark surveillance program’’ కింద బీచ్‌ల వద్ద రక్షణ చర్యలను కట్టుదిట్టం చేయనుంది.

లాంగ్ ఐలాండ్‌లోని స్టేట్ పార్క్ డైరెక్టర్ జార్జ్ గోర్మాన్( Director George Gorman ) ఇటీవల జరిగిన షార్క్ దాడులపై స్పందించారు.

పర్యవేక్షణ సామర్ధ్యాలతో కూడిన డ్రోన్‌లు తమ నిఘాను మరింత మెరుగుపరిచేందుకు వేవ్ రన్నర్స్ లైఫ్‌గార్డ్స్‌లకు సహాయంగా వుంటాయని గోర్మాన్ ( Gorman )ఆశాభావం వ్యక్తం చేశారు.బీచ్‌లను తెరవడానికి ముందు, మధ్యాహ్న సమయాలు, బీచ్‌లు మూసివేయడానికి ముందు డ్రోన్‌ల ద్వారా సముద్రంలోని పరిస్థితులను తెలుసుకుంటామని ఆయన చెప్పారు.

Telugu George Gorman, Kathy Hochul, York, Shark-Telugu NRI

షార్క్ దాడుల నేపథ్యంలో డ్రోన్ విమానాలు, స్టేట్ పార్క్ నిఘా కార్యక్రమాలను విస్తరిస్తున్నట్లు న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్( Kathy Hochul ) ప్రకటించారు.దీని వల్ల షార్క్‌లపై నిఘా కార్యకలాపాలను సమర్ధవంతంగా పర్యవేక్షించడానికి , గతంలో ఈ తరహా చర్యలు చేపట్టని బీచ్ సైడ్ నగరాలను అనుమతిస్తామని గవర్నర్ తెలిపారు.డ్రోన్‌లను ఆపరేట్ చేయడంలో శిక్షణ ఇచ్చే సిబ్బందికి రాష్ట్రం తరపున నిధులు అందిస్తామని ఆమె పేర్కొన్నారు.బీచ్‌లను సుక్షితంగా వుంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ తెలిపారు.

దీని ద్వారా న్యూయార్క్ సిటీలోని కమ్యూనిటీలను ముందస్తుకు అప్రమత్తం చేయవచ్చన్నారు.

Telugu George Gorman, Kathy Hochul, York, Shark-Telugu NRI

ఈ గురువారం రాబర్ట్ మోసెస్ స్టేట్ పార్క్( Robert Moses State Park ) వద్ద 10 అడుగుల షార్క్ కనిపించడంతో అధికారులు ఈ ప్రాంతంలో ఈత కొట్టడాన్ని నిషేధించారు.ఈ వారంలో ప్రారంభంలో అదే బీచ్‌లో ఒక టీనేజ్ అమ్మాయిపై షార్క్ దాడి చేసింది.అలాగే కిస్మెట్ బీచ్‌లో సర్ఫింగ్ చేస్తుండగా 15 ఏళ్ల బాలుడిపై దాడి చేసిన షార్క్ పాదాలను కొరికేసింది.

ఫైర్ ఐలాండ్ పైన్స్ బీచ్‌, క్వోగ్ విలేజ్ బీచ్‌లలో ఇద్దరు వ్యక్తులపైనా షార్క్ దాడి చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube