తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ విజయం సాధిస్తుందన్న భయంతోనే కొందరు పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలకు శుభసూచకమని పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎప్పటికీ ఒక్కటి కావని స్పష్టం చేశారు.కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పని చేస్తుందని వెల్లడించారు.







