బ్యాంకు నుంచి లోన్ తెచ్చి అమెరికాలో గుడి కట్టిన భారతీయులు

కొంతమందికి దైవభక్తి బాగా ఎక్కువగా ఉంటుంది.రోజూ గుడికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.

 Indians Who Took A Loan From The Bank And Built A Temple In America, Bank, Loan,-TeluguStop.com

అలాగే వత్రాలు, హోమాలు లాంటికి కూడా చేస్తూ ఉంటారు.నిత్యం దేవుడిని స్మరించుకుంటూ భగవంతుడి సేవలో గడుపుతారు.

దేవుడిపై ఉన్న భక్తితో హుండీలె డబ్బులు వేసి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.అలాగే దేవాలయాలకు( temples ) పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ దైవభక్తిని చాటుకుంటారు.

మరికొంతమంది అయితే తమ సొంత డబ్బులతో దేవాలయాలను నిర్మిస్తూ ఉంటారు.తాజాగా అలాంటి ఒక ఘటన ఒకటి చోటుచేసుకుంది.

Telugu Bank, Loan, Temple, Latest-Latest News - Telugu

ఇండియాలో వీధివీధికి ఒక దేవాలయం ఉంటుంది.ప్రతీ వీధిలోనూ ఏదోక దేవుడికి సంబంధించిన దేవాలయం తప్పనిసరిగా ఉంటుంది.ఇక అమెరికాలో( America ) అయితే హిందూ దేవాలయాలు తక్కువగా ఉంటాయి.కానీ హిందూవుల కోసం ఒక దేవాలయం కట్టేందుకు కొంతమంది భారతీయులు విరాళం వేసుకుని కాలిఫోర్నియాలో( California ) ఒక దేవాలయం నిర్మించారు.వాటితో పాటు బ్యాంకు నుంచి లోన్ కూడా తీసుకుని దేవాలయం కట్టించారు.1974లో ఉత్తర కాలిఫోర్నియాలో దేవాలయం నిర్మించాలని కొంతమంది భారతీయులందరూ కలిసి నిర్ణయించుకున్నారు.1977లో అందరూ కలిసి నాలుగెకరాల స్థలాన్ని కూడా ఒకచోట కొనుగోలు చేశారు.

Telugu Bank, Loan, Temple, Latest-Latest News - Telugu

స్థలాన్ని కొనుగోలు చేసేందుకు గుజరాత్‌కు చెందిన అద్వాణి ( Advani )అనే భక్తుడు రూ.4.50 లక్షలు విరాళంగా ఇచ్చాడు.ఇలా అందరూ వివరాలు వేసుకుని దేవాలయం నిర్మాణం ప్రారంభించగా.స్థానిక పాలనా సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది.దీంతో రెండేళ్లపాటు నిరసనలు తెలిపారు.ఆ తర్వాత 20 మంది తమ ఇళ్లను తాకట్టుగా పెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( State Bank of India )నుంచి రూ.60 లక్షలు విరాళంగా తీసుకున్నారు.ఈ డబ్బులతో వేరే ప్రాంతంలో వెంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించారు.

ఈ దేవాలయంలో ఇప్పటికీ రోజూ పూజలతో పాటు ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube