టీమిండియా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్( Rahul Dravid )పై ప్రశంసల వర్షం కురిపించారు బ్రిటన్ ప్రధాని, భారత సంతతికి చెందిన రిషి సునాక్.ద్రావిడ్ తన ఫేవరేట్ క్రికెటర్ అని తెలిపారు.
బీబీసీ టీఎంఎస్ లంచ్ టైమ్ షోకు అతిథిగ హాజరైన ప్రధానిని.లార్డ్స్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బౌన్సర్ వ్యూహం గురించి ఏమనుకుంటున్నారని అడిగారు.
దీనికి ద్రావిడ్ గతంలో అనుసరించిన వ్యూహాన్ని రిషి సునాక్ గుర్తుచేసుకున్నారు.రాహుల్ ద్రావిడ్ తన అభిమాన ఆటగాడని, ఆయన టెక్నిక్, అటిట్యూడ్, వ్యక్తిత్వం తనకు ఇష్టమని ప్రధాని చెప్పారు.
ఆ తర్వాత ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌ను ప్రత్యక్షంగా చూసిన సమయాన్ని రిషి సునాక్( Rishi Sunak ) గుర్తుచేసుకున్నారు.

2008 ముంబై ఉగ్రదాడి సమయంలో తాను భారత్‌లో వున్నానని చెప్పారు.తాను స్నేహితుడి పెళ్లికి వెళ్లానని.ఉగ్రదాడి కారణంగా ఇంగ్లాండ్ జట్టు అర్ధాంతరంగా భారత్ నుంచి వెళ్లిపోయిందని ఆయన తెలిపారు.
కొన్నిరోజుల తర్వాత ఇంగ్లాండ్ జట్టు తిరిగొచ్చి..
చెన్నైలో టెస్ట్ ఆడాలని నిర్ణయించుకుందని రిషి సునాక్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ ఛేదించిందని.
సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) భారీ స్కోర్ చేశారని, ఆయన బ్యాటింగ్ చాలా బాగుందని ప్రధాని చెప్పారు.తాను చిన్నప్పటి నుంచి రాబిన్ స్మిత్, హాంప్‌షైర్ స్టార్, మాల్కమ్ మార్షల్‌లను చూస్తూ పెరిగానని , వారందరినీ చూసే అదృష్టం తనకు దక్కిందని రిషి సునాక్ హర్షం వ్యక్తం చేశారు.

కాగా.ది వాల్, మిస్టర్ డిపెండబుల్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే రాహుల్ ద్రావిడ్‌ను క్రికెట్‌లో టెక్నిక్‌కు మారుపేరుగా పిలుచుకుంటారు.ఏ ఫార్మాట్ అయినా సరే ఒకేలా ఆడటం ఆయన స్పెషాలిటి.కెరీర్‌లో అన్ని ఫార్మాట్‌లు కలిపి 24,208 పరుగులు చేసిన ఆయన 48 అంతర్జాతీయ సెంచరీలు చేశారు.వన్డే, టెస్టుల్లో పదివేల పరుగులు చేసిన అరుదైన ఆటగాడిగా ద్రావిడ్ చరిత్ర సృష్టించారు.2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు ద్రావిడ్ రిటైర్మెంట్ ప్రకటించారు.తర్వాత అండర్ 19, భారత్ ఏ జట్లకు చీఫ్ కోచ్‌గా, ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.







