సినీ హీరో ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అభిమాని మరణంపై విచారం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం శ్యామ్ మృతిపై అధికారులు దర్యాప్తు జరపాలని ఆయన కోరారు.అయితే కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కడలివారిపాలెంలో పెద్దమ్మ నివాసంలో అభిమాని మేడిశెట్టి శ్యామ్ చేయి కోసుకుని, ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.
ఈ క్రమంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







