Taapsee: తాప్సీ టాలీవుడ్ ను వదిలేయటానికి కారణం ఆ హీరోనా.. నమ్మించి మోసం చేశాడా?

ఒక ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉన్నట్టుండి ఒకేసారి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వెంటనే వేరే భాషలోకి అడుగు పెడుతుంటారు.అయితే వాళ్ళు అలా వెళ్ళిపోవడానికి రకరకాల కారణాలు కచ్చితంగా ఉంటాయని చెప్పాలి.

 Is That Hero The Reason For Taapsee To Leave Tollywood-TeluguStop.com

అవకాశాలు రాకపోవడం వల్లనో లేక తాము అతిగా ప్రవర్తించడం వల్లనో ఇలా ఏదో ఒక కారణంతో దూరం అవుతూ ఉంటారు.అయితే హీరోయిన్ తాప్సీ( Taapsee ) కూడా టాలీవుడ్ కు గుడ్ బై చెప్పటానికి ఒక రీజన్ ఉంది.

ఇంతకు అదేంటో తెలుసుకుందాం.

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

అతి తక్కువ సమయంలో తన నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.తాప్సీ 2010లో ఝుమ్మందినాదం సినిమాతో( Jhummandinadam Movie ) తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఈ సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.

ఇక 2011లో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై అక్కడ కూడా మంచి సక్సెస్ లను అందుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉండగా బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించడానికి బాగా ఆసక్తి చూపిస్తుంది.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో తన ఖాతా నింపుకుంటుంది.

Telugu Bollywood, Taapsee, Son, Taapseeglamor, Taapsee Love, Taapsee Pannu, Toll

ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా సమయాన్ని గడుపుతుంది.అప్పుడప్పుడు తన అభిమానులతో బాగా ముచ్చట్లు పెడుతుంది.తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్ డేట్ లను బాగా పంచుకుంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ బాగా వర్కౌట్ లు చేసి సన్నబడింది.

Telugu Bollywood, Taapsee, Son, Taapseeglamor, Taapsee Love, Taapsee Pannu, Toll

అవకాశాల కోసం మరింత గ్లామర్ షో చేస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాప్సీ టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood ) నుండి బయటికి వెళ్ళటానికి ఒక బలమైన కారణం ఉందని తెలిసింది.అదేంటంటే.తన ప్రేమ వ్యవహారం వల్ల అని వార్తలు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కొడుకు ఈమెకు మాయ మాటలు చెప్పి ప్రేమలో ముంచాడు.దాంతో తను కూడా అతనిపై మనసు పారేసుకుంది.

Telugu Bollywood, Taapsee, Son, Taapseeglamor, Taapsee Love, Taapsee Pannu, Toll

అలా ప్రేమ పేరుతో ఆ హీరో తాప్సీని బాగా తిప్పాడట.ఇక చివరికి నువ్వు వద్దు అని చెప్పి హ్యాండ్ ఇచ్చాడట.దీంతో ప్రేమ విఫలమైందన్న బాధను భరించలేక తాప్సీ.అతడి ముందు ఆ ఇండస్ట్రీలో ఉండలేక మరో ఇండస్ట్రీకి వెళ్లిపోయింది అని తెలిసింది.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం గురించి మాత్రం తాప్సీ ఏ రోజు కూడా స్పందించలేదు.ఇక ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస సినిమాలతో స్టార్ హోదాలో దూసుకుపోతుందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube