ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాదించి ముచ్చటగా మూడవసారి కూడా అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది.అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తూ ముందుకు సాగుతోంది.
మొత్తం 545 లోక్ సభ సీట్లలో 2014 ఎన్నికల్లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు కైవసం చేసుకొని ఏ పార్టీ అండ లేకుండానే అధికారం లోకి వచ్చింది బీజేపీ.అయితే పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి.
గతంలో దేశ వ్యాప్తంగా మోడీ నామ జపం గట్టిగా వినిపించేది.కానీ ప్రస్తుతం మోడీ మేనియా తగ్గిందనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
కారణాలు ఏవైనప్పటికి మోడీ సర్కార్( Narendra Modi ) పై అడపా దడపా వ్యతిరేకత వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి విజయం సాధ్యమేనా.? ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లుగా హ్యాట్రిక్ విజయం వరించేనా ? అంటే సమాధానం ప్రశ్నార్థకంగానే ఉంటోంది.ఈసారి మోడీ సర్కార్ ను గద్దె దించాలని అటు విపక్షాలు కూడా గట్టి పట్టుదలతో ఉన్నాయి.
ఇటు ప్రజల్లో కూడా మార్పు కోసం ఆలోచన మారుతోంది.ఈ నేపథ్యంలో బీజేపీకి దేశ ప్రజలు వచ్చే ఎన్నికల్లో షాక్ ఇచ్చిన ఆశ్చర్యం లేదనేది కొందరు చెబుతున్నా మాట.అయితే కమలనాథులు మాత్రం బీజేపీ గెలుపుపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కూడా 300 కు పైగా సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా( Amit Shah ) ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

మరి కాషాయ పార్టీ పెద్దలు ఇంతా కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణం ఏమిటనే దానిపై రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.ప్రస్తుతం మోడీని ఢీ కొట్టే బలమైన ప్రత్యర్థి లేకపోవడం ఒక కారణం అయితే.విపక్షాల ఐక్యత సాధ్యం కాదనేది కమలనాథులు చెబుతున్నా మాట.విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన చివరకు బీజేపీకే ప్లేస్ అవుతుందని, అందుకే వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీకి తిరుగులేదనేది కమలనత్తుల ధీమా.అయితే వారు ఆశిస్తున్నట్లుగా 300 సీట్లు కైవసం చేసుకోవడం సాధ్యమేనా అంటే కష్టమే అని చెప్పాలి.
ఎందుకంటే ఇటీవల బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా గట్టిగానే పుంజుకుంది.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర( Bharat Jodo Yatra ) ప్రభావం కాంగ్రెస్ కు గట్టిగానే కలిసొచ్చేలా కనిపిస్తోంది.
దాంతో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన సీట్లు సాధించే అవకాశం ఉందనేది విశ్లేషకుల మాట.మరి కాంగ్రెస్ కు సీట్ల సంఖ్య పెరిగితే బీజేపీకి ఆటోమేటిక్ గా ఓటు బ్యాంకు తగ్గుతుంది.మరి కాషాయ పార్టీ 300 సీట్ల టార్గెట్ రిచ్ అవుతుందో లేదో చూడాలి.







