సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లుగా రాణించడం అంటే కాస్త కష్టమే అని చెప్పవచ్చు.మరి ముఖ్యంగా హీరోయిన్ ల విషయానికొస్తే అతి తక్కువ పారితోషికం, కెరీర్ ఎక్కువ కాలంపాటు కంటిన్యూ అవ్వదు.
పెళ్లి అయితే యాక్ట్రెస్ అనే ప్రొఫెషన్‌కి ఎండ్ కార్డ్ పడిపోయినట్లే అని చెప్పవచ్చు.అందుకే హీరోయిన్లు ఫామ్ లో ఉన్న సమయంలో నాలుగు రోజులు వెనక్కి తీసుకోవాలని అంటూ ఉంటారు.
హీరోలు పెళ్లి అయినప్పటికీ ఇండస్ట్రీలో రాణిస్తూనే ఉంటారు.కానీ హీరోయిన్ లకు పెళ్లి అవగానే సెకండ్ ఇన్నింగ్స్ అనే పేరును పెట్టేస్తూ ఉంటారు.
సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాల్లో నటించి ఆ తర్వాత ఫేడ్ ఔట్ అయిపోయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.అలా శంకర్ దాదా జిందాబాద్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కరిష్మా కొఠారి, వరుడు సినిమా తో పరిచయమైన భాను శ్రీ మెహ్రా వంటి కొందరిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కానీ హీరోయిన్ సాక్షి వైద్య( Sakshi Vaidya ) పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది.అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాతో( Agent Movie ) తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా ఘోర పరాజయం పాలైంది.

ఈ సినిమా తర్వాత హీరోయిన్ కు అవకాశాలు రావడం కష్టమే అని చాలామంది భావించారు.అయితే ఇప్పుడు హీరోయిన్ సాక్షి కి ఒకటీ రెండూ కాదు ముచ్చటగా మూడు క్రేజీ ఆఫర్స్ వరించాయి.ఆ మూడు కూడా మెగా హీరోల సినిమాలు కావడం విశేషం.
వరుణ్ తేజ్,( Varun Tej ) సాయి ధరమ్ తేజ్,( Sai Tej ) పవన్ కళ్యాణ్‌ల( Pawan Kalyan ) పక్కన తను ఆడిపాడబోతుందనే వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కుతున్న గాండీవధారి అర్జున సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది.

అలాగే సాయి ధరమ్ తేజ్ జయంత్ అనే కొత్త దర్శకుడితో చెయ్యబోయే సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్యను తీసుకున్నట్లు తెలుస్తోంది.త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్‌ల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
సెకండ్ హీరోయిన్ రోల్ కోసం సాక్షిని అనుకుంటున్నట్లు టాక్.ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే హీరోయిన్ సాక్షి వైద్యకు ఇక అవకాశాలు వరుసగా క్యూ కట్టడం ఖాయం అని చెప్పవచ్చు.







