శ్రీలీల( Sreeleela ).ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.
పెళ్లి సందడి( Pelli SandaD ) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ లలో బిజీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో శ్రీలీల కూడా ఒకరు.
పెళ్లిసందD సినిమా తర్వాత రవితేజ( Ravi Teja ) నటించిన ధమాకా సినిమాతో కమర్షియల్ హిట్ ను అందుకుంది.ఈ సినిమాలో అమ్మడు క్రేజ్ అందం డాన్స్ కి యువత ఫిదా అయ్యారు.

మామూలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ లకు అవకాశాలు రావు అన్న విషయాన్ని తప్పు అని నిరూపించింది శ్రీలీల.ప్రస్తుతం శ్రీ లీల క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.తన మేనియా ఎలా ఉందో ఇటీవల బర్త్‌డే విషెస్ చెప్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది.భగవత్ కేసరిసినిమా లో బాలయ్య కూతురిగా చేస్తోంది.
గుంటూరు కారం మూవీలో సెకండ్ హీరోయిన్ కాస్త మెయిన్ హీరోయిన్ అయిపోయింది.వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఆదికేశవ సినిమా పూర్తయింది.
రామ్, బోయపాటి మూవీ, నితిన్ 32, గాలి జనార్థన్ రెడ్డి కొడుకు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న జూనియర్ అనే కన్నడ సినిమాలో నటిస్తోంది.

అలాగే విజయ్ దేవరకొండతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నాయి.అలాగే సాయి ధరమ్ తేజ్, సంపత్ నందిల సినిమాతో పాటు మరి కొన్ని క్రేజీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.అవకాశాలు వస్తున్నప్పటికీ తనకు డేట్స్ ఖాళీ లేవు అని చెప్పడానికి కూడా కాళీ లేనంత బిజీ బిజీగా మారిపోయింది శ్రీలీల.
ప్రస్తుతం దర్శక నిర్మాతలకు ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది.గతంలో అనుష్క, ఇలియానా తర్వాత కొంతమంది కథానాయికలకు ఇలాగే క్రేజ్ వచ్చినా, ఆఫర్స్ వచ్చినా శ్రీలీల రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయలేదనే చెప్పాలి.
దీంతో శ్రీలీల కు ఉన్న క్రేజ్, డిమాండ్ ఆఫర్స్ ని చూసి స్టార్ హీరోయిన్స్ భయపడుతున్నారు.టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ లకు అవకాశాలు రావు అన్న విషయాన్ని తప్పు అని నిరూపించి చరిత్ర సృష్టించింది శ్రీలీల.







